సైలెంట్‌గా వ‌చ్చి వయొలెంట్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు ఉప్పెనతో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్ద‌రు కొత్త నటులతో, విజయ్ సేతుపతి వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ తో బంపర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడాయన నెక్ట్స్ మూవీ ఎవ‌రితో చేస్తార‌నే దానిపై ప్రతిఒక్కరిలో క్యూరియాసిటి పెరిగింది.
అయితే కమిట్మెంట్ ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే రెండు సినిమాలు చేయనున్నాడు బుచ్చిబాబు. రెండో సినిమా అక్కినేని నాగ చైత‌న్యతో చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. నిన్నటివరకు అఖిల్ కోసం నాగార్జున రాయభారం నడిపారని అనుకున్నారు. కానీ బుచ్చిబాబు చైతూతో కమిటైనట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే నాగార్జునతో పాటూ చైతన్యకూ స్టోరీ వినిపించ‌డం… ఓకే చెప్పడం కూడా జ‌రిగిపోయాయ‌ట‌. ఈ ఏడాదిలోనే ఈ మూవీ ప్రారంభంకానుంది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ మూవీ చేస్తోన్న చైతూ…నెక్ట్స్ బుచ్చిబాబుతోనే పట్టాలెక్కుతాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *