మొన్నటి వరకు బిగ్ బాస్ 4 తెలుగుతో బిజీగా ఉన్నారు అక్కినేని నాగార్జున. బిగ్ బాస్ క్లైమాక్స్ పూర్తయ్యాక సామాజిక కార్యక్రమాలతో సమయం గడుపుతున్నారు. సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో ఆడపాదడపా పాలుపంచుకునే నాగార్జున… తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 49లో ప్రత్యేకమైన మొక్కలు నాటారు. తమ కాలనీతో పాటూ ప్రపంచం పచ్చదనంతో ఉండాలని ఆకాంక్షిస్తూ వాల్గో ఇన్ ఫ్రా MD, CEO శ్రీధర్ రావు గారితో కలిసి మొక్కలు నాటారు నాగార్జున. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు.. జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కోసం శంకుస్థాపన చేశారు. అక్కడ ఇంకా ఎన్నో ప్రత్యేకమైన చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని నాగార్జున కాసేపు సేద తీరారు.

మాస్టర్ అబూ శ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నాగార్జున కాసేపు చిన్నారితో ఆడుకున్నారు. ఆ తర్వాత కాలనీ వాసులతో మాట్లాడి చెట్లు పెంచుతున్న వాళ్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మన పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అంటూ తెలిపారు నాగార్జున. ఈ కార్యక్రమంలో నాగార్జున స్నేహితుడు సతీష్ రెడ్డి, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. పలువురు కాలనీవాసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *