ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నాని టక్ జగదీష్ అలర్టయింది. సందర్భాన్ని వాడుకునేందుకు ప్రేమగా ఫిక్సయింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ఫ్యామిలీ కం యాక్షన్ చిత్రం ”టక్ జగదీష్”. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి – హరీష్ పెద్ది జతగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాని సరసన రీతూ వర్మతో పాటూ ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఏప్రిల్ 23న టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్… ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడిక వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ సాంగ్ ‘ఇంకోసారి ఇంకోసారి’ ని విడుదల చేయనున్నారు.

సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ గీతాన్ని ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. కాగా దీనికి సంబంధించి ఓ లవ్లీ పోస్టర్ ని మూవీ యూనిట్ వదిలింది. హీరోయిన్ రీతూ వర్మ ఒక దగ్గర కూర్చోగా.. మన నాని ఆమె చేయి పట్టుకుని కళ్ళలోకి చూస్తున్నాడు. ఈ సినిమాకి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తుండగా… ప్రవీణ్ పూడి ఎడిటర్. నాజర్, రోహిణి, డేనియల్ బాలాజీ, ప్రవీణ్, ప్రియదర్శి, నరేష్ వంటి వారు నటిస్తున్నారు. ఇది నాని నటిస్తోన్న 26వ చిత్రం. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత… నాని – శివ నిర్వాణ కాంబో మూవీగా వస్తోన్న ‘టక్ జగదీష్’ పై ప్రేక్షకులకి మంచి అంచనాలే ఉన్నాయి.

o

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *