ఈ బర్త్ డే చాలా స్పెషల్ అంటున్నారు నాచురల్ స్టార్ నాని. ఆల్రెడీ టక్ జగదీష్ గా విడుదలకు సిద్ధమవుతున్నారు. ఓవైపు శ్యామ్ సింగ రాయ్ గా..మరోవైపు సుందరానిగా అలరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. మొత్తానికి కరోనా తర్వాత కలిసొచ్చిందంటున్నారు బర్త్ డే బాయ్.. నాని.

సాధారణ స్థాయి నుంచి నాచురల్ స్టార్ గా ఎదిగారు నాని. నాని సినిమా చేస్తున్నారంటే ఏదో విషయం ఉందని నమ్మతారు ప్రేక్షకులు. ఇప్పుడు తాను నటిస్తోన్న సినిమాలు కూడా అలాంటివే. ఈ బర్త్ డే సందర్భంగా తన మూవీలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ఇస్తున్నారు. పుట్టినరోజుకు ఒకరోజు ముందుగా టక్ జగదీష్ టీజర్ ను తీసుకొచ్చారు. నిన్ను కోరి తర్వాత శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన టక్ జగదీష్ ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాక్సీవాలా ఫేం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. నాని పుట్టినరోజున ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాదు వివేక్ ఆత్రేయతో చేస్తోన్న అంటే సుందరానికి టీం నుంచి కూడా ఓ సర్పైజ్ ఉండబోతుందని టాక్. ఇలా మూడు డిఫరెంట్ సినిమాలతో ఆడియెన్స్ ముందుకు ముచ్చటగా రాబోతున్న నానికి నిజంగానే ఈ బర్త్ డే చాలా స్పెషల్.

Source: Shine Screens

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *