దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార మహారాణిగా మారనున్నారని వార్తలొచ్చాయి. నయన్ ను రాణిగా చూడటం కొత్తేమీ కాదు. శ్రీరామరాజ్యంలో రాముని పట్టమహీషి సీతమ్మగా… కార్తి కాష్మోరాలో కాసేపు యువరాణిగా…చిరూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సతీమణి సిద్ధమ్మగా కనిపించి మెప్పించారు నయనతార. అయితే ఈసారి బ్రిటిష్వారిపై పోరాడిన మొట్టమొదటి క్వీన్ గా కనిపించేందుకు రెడీఅవుతున్నారని ప్రచారం జరిగింది. ఆ రాణి పేరు వేలు నాచ్చియార్. తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురానికి చెందిన రాణి వేలు నాచ్చియార్. 1780 నుంచి 1790 వరకూ శివగంగై సంస్థానానికి అన్ని తానై పాలించారు వేలు నాచ్చియార్. ఆమె జీవితం ఆధారంగా డైరెక్టర్ సుశీ గణేశన్ఓ మూవీనీ తెరకెక్కించనున్నాడు. ఇందులోనే రాణి పాత్రకు నయనతారను సంప్రదించారనీ… ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు నయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తమిళ్ మీడియా కోడై కూసింది.
సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ నయన్ గ్లామర్ మాత్రం పెరుగుతూనేఉంది. ఓ వైపు రెగ్యులర్కమర్షియల్సినిమాల్లో హీరోల సరసన నటిస్తూ, మరోవైపు హీరోయిన్ఓరియంటెడ్సినిమాలతో దూసుకెళుతున్నారు నయనతార. అందుకే వేలు నాచ్చియార్కి నయనతార అయితేనే కరెక్ట్ అని సుశీ గణేశన్అనుకున్నారని టాక్ వినిపించింది.. వేలు నాచ్చియార్కి యుద్ధ విద్యల్లోని నైపుణ్యంతో పాటూ గుర్రపు స్వారీ, విలు విద్య, కర్ర సాము వంటివన్నీ తెలుసు. మరి ఆమెలా కనబడాలంటే వీటన్నింటిని ప్రదర్శించాలని తెలుసుకున్న నయన్…ప్రాక్టీస్ ఎప్పటినుంచి ప్రారంభిస్తుందో అని కూడా లెక్కలేసారు.
కానీ ఈ వార్తల్ని ఖండించింది నయనతార. అఫీషియల్ గా తన టీం నుంచి నోటీస్ రిలీజ్ చేసింది. తాను రాణిగా నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని వెల్లడించింది. ఇలాంటి వార్తల్ని ప్రచారం చేసేముందు కాస్త ఆలోచించి…నా టీంను తెలుసుకుని పభ్లిష్ చేయాలని తెలిపింది. సో మహారాణిగా…నయన్ అన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *