సరి కొత్త అవతారాలని ఎత్తబోతున్నాడు నితిన్. ’20, 40, 60′ అంటూ సందడి చేయబోతున్నాడు. మామూలుగా కమల్ హాసన్ వంటి వారు చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు నితిన్ ట్రై చేస్తున్నాడు. ఇన్నాళ్లు ఉన్న లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ అన్న ఇమేజ్ ను పోగొట్టి నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. అందుకే ‘అంధాదూన్’ రీమేక్ లో అంధుడిగా నటిస్తున్నాడు. ఇక తాజాగా మరో ప్రయోగానికి సై అన్నాడు.
నితిన్ హీరోగా ‘పవర్ పేట్’ అనే ప్రాజెక్ట్ ని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కృష్ణ చైతన్య’ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాకి. ఒక వ్యక్తి నాలుగు దశాబ్ధాల ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే నితిన్…20ఏళ్ల యువకుడిగా, 40ఏళ్ల మధ్య వయస్కుడిగా, 60ఏళ్ల వృద్ధుడిగా కనిపించబోతున్నాడు.
ప్రయోగానికి సై అన్నాడు…సరే…కానీ నితిన్ అలా చూపించాలంటే కరెక్ట్ మేకప్ మ్యాన్ దొరకాలి. ఏదో చేసామన్నట్టు చేస్తే..ఈ కాలం జనానికి ఎక్కదు. అందుకే బాలీవుడ్ ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ ‘రషీద్’ ను నితిన్ కోసం తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ నటిస్తోన్న ’83’మూవీకి ఈయనే మేకప్ మ్యాన్. కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ ను అద్భుతంగా ప్రెజెంట్ చేస్తున్నాడట. అందుకే రషీద్ తో నితిన్ కి టెస్ట్ మేకప్ చేసారట. రిజల్ట్ అదిరిపోవడంతో ఈయన్నే నితిన్ సినిమాకి ఫిక్స్ అయినట్టు సమాచారం. అన్నీ కుదిరితే సమ్మర్ ఎండింగ్ లో పవర్ పేట్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *