ప్రస్తుతం త‌న జోరు కొన‌సాగిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉంటున్నారో…కమిట్ అయిన సినిమాల విషయంలో అంతే శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ మూవీ షూటింగ్ పూర్తి కాగా, ఈ ప్రాజెక్ట్ తో మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. వకీల్ సాబ్ కి గుమ్మడికాయ కొట్టిన వెంటనే క్రిష్ సినిమాను స్టార్చ్ చేసారు. ఇప్పుడిక తాజాగా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ మూవీని కూడా మొదలెట్టేసారు.

ఈరోజు నుంచి ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనుంది. పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్ సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేస్తారట డైరెక్టర్ సాగర్ కె చంద్ర. త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న ఈ క్రేజీ రీమేక్ కూడా 2021లోనే విడుద‌ల చేసేందుకు ప‌వ‌న్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *