మూడేళ్ల నిరీక్షణ…అజ్ఞాతవాసి తర్వాత ఆకలి మీదున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ కే సినిమా విడుదలైనంత హైప్ తీసుకొచ్చారు. మరి మూవీ రిలీజైతే? చూస్తుంటే ఈ మేనియా ఇక్కడితో ఆగేలా లేదు. ఏప్రిల్ 9…వకీల్ సాబ్ థియేటర్లకి వచ్చే వరకు ఏం జరుగబోతుంది? పవన్ ఫ్యాన్స్ సందడి పీక్స్ కు చేరుతుందా?

పవర్ స్టార్ మేనియా షురూ అయింది. పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న వకీల్ సాబ్ ట్రైలర్ రానేవచ్చింది. హ్యాష్ వకీల్ సాబ్ ట్రైలర్ డే పేరుతో ఫ్యాన్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 1.65కోట్లకు పైగా వ్యూస్‌, 9లక్షలకు పైగా లైక్స్‌ అందుకోని రికార్డులను తిరగరాస్తోంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్ సాబ్’గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో… ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరోవైపు బాబాయ్..మైండ్ బ్లోయింగ్ అంటూ రామ్ చరణ్ ట్రైలర్ చూసి ట్వీట్ చేసారు. ట్రైలర్ కే ఇలా ఉంటే రిలీజ్ రోజు థియేటర్స్ బ్లాస్టే అంటూ బండ్ల గణేశ్ వంటి వారు కామెంట్ చేస్తున్నారు.

బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ అయినా… పవన్ ఇమేజ్ కి తగినట్టు, మన నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసారు డైరెక్టర్ వేణు శ్రీరామ్‌. కాగా నైజాం, ఈస్ట్, వైజాగ్, నెల్లూర్ ప్రాంతాల్లోని కొన్ని థియేటర్లలో వకీల్ సాబ్ ట్రైలర్ ని సరికొత్తగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సినిమా రిలీజైతే ఎలాంటి సందడి ఉంటుందో…వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ కు అంతే సరదా కనిపించింది. థియేటర్లలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ హంగామాను సృష్టించి…వకీల్ సాబ్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో చెప్పకనే చెప్పారు.

పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే మొదటి రోజు చూడాల్సిందే. ఫస్ట్ డే…ఫస్ట్ షోలో కూర్చోవల్సిందే. ఈ విషయం వకీల్ సాబ్ నిర్మాతలకు తెలుసు. అందుకే తొలిరోజే వీలైనంత కలెక్షన్స్ రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 8 అర్థరాత్రి నుంచి మూడు మిడ్‌నైట్ షోలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 1500రూపాయల టికెట్ ఫిక్స్ చేసారని టాక్. అంతేకాదు ఏప్రిల్ 9 నుంచి నార్మల్ టికెట్ 200వరకు ఉంటుందనీ చెప్తున్నారు. మరోవైపు 2వందలు కాదు, 2వేలు కాదు…తమ ఫేవరేట్ హీరో కోసం ఎంతైనా పెట్టేందుకు సిద్ధమంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *