పపన్ కల్యాణ్, క్రిష్ మూవీ కోసం భారీ షిప్ సెట్ ను వేయ‌గా అది భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తింది. ఓడ సెట్ ప‌నులు పూర్త‌య్యాక ప‌వ‌న్ షూటింగ్ లో జాయిన్ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే గనుక త్వరగా జరిగితే క్రిష్ పవన్ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకెళ్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు పండుగ చేసుకుంటారు. ఇక ఇందులో పవన్ సరసన హీరోయిన్ గా నటించేందుకు రకుల్ ఆసక్తి చూపిస్తుందని తెలిసింది. అయితే కథపరంగా క్యారెక్టర్లని డిసైడ్ చేసే క్రిష్ రకుల్ ను పక్కకుపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే కొండపాలెం సినిమాతో క్రిష్ తో కలిసి వర్క్ చేస్తుంది రకుల్. ఈ మూవీ తర్వాత సైతం పవన్ కాంబినేషన్ లో క్రిష్  తో కలిసి పని చేద్దామంటే కుదిరేలా కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *