ఆదిపురుష్ కి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా కొన్ని అప్​డేట్స్ ఇచ్చారు దర్శకుడు రౌత్.
షూటింగ్ ఈ నెల చివర్లో ప్రారంభిస్తామని వెల్లడించారు ఓం రౌత్. అలాగే ఇందులో సీతగా కనిపించే హీరోయిన్ ఎవరనేది మరి కొన్ని రోజుల్లోనే ప్రకటిస్తారట. కృతి సనన్… సీత పాత్ర చేస్తోందనే ప్రచారం బాగా జరుగుతుంది. ఇప్పటికే ఆదిపురుష్ వర్క్ షాప్​లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ను భూషన్ కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *