డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజాహెగ్దే ఎలా ఉండబోతున్నారన్న సస్పెన్స్ కు ఫిబ్రవరి 14తో తెరపడనుంది. అంతేకాదు పూర్తి సినిమాతో వీళ్లిద్దరూ ఎప్పుడు వస్తున్నారో కూడా అదే రోజు తెలిసే ఛాన్స్ కూడా ఉంది. అవును దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న రాధేశ్యామ్ టీజర్ అండ్ రిలీజ్ డేట్ ఈ 14న వాలంటైన్స్ డే కానుకగా విడుదల చేయనున్నారు. రాధేశ్యామ్ మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తయినా ఇంతవరకూ ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అయితే ఈ చిత్రం పీరియాడికల్‌ లవ్‌స్టోరీ కథాంశంగా తెరకెక్కించడంతో ప్రేమికుల రోజునే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. రాధాకృష్ణ డైరెక్షన్లో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథా చిత్రం పాన్ ఇండియన్ మూవీగా 5 భాషలలో విడుదలకు రెడీఅవుతోంది.

యువీ కృష్ణంరాజు సమర్పణలో… యువి క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై వంశీ ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ లవ్ స్టోరీలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే రోల్ లో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణగా మ్యూజిక్ టీచర్‌ రోల్ చేస్తున్నారని టాక్. అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీతో పాటూ సచిన్ కేడ్కర్, సాషా ఛత్రీ, ప్రియదర్శి వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌ సీన్స్ కోసమే దాదాపు 30 కోట్ల రూపాయల ఖర్చుతో స్పెషల్ సెట్స్‌ వేసినట్టు వార్తలొచ్చాయి. ఇక ఆస్కార్‌ సాధించిన ‘గ్లాడియేటర్‌’ మూవీకి యాక్షన్‌ కొరియోగ్రఫీ సెట్ చేసిన నిక్‌ పోవెల్‌ ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’కి సైతం పనిచేస్తుండటం మరింత ఆసక్తిని పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *