డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించి మరో న్యూస్ హల్చల్ చేస్తోంది. ఆయన నటిస్తోన్న రాదేశ్యామ్ చివరిదశకు చేరుకోగా ఆదిపురుష్, సలార్ రీసెంట్ గా ప్రారంభమయ్యాయి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుకావాల్సిఉంది. ఇలా ఇప్పుడు ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియాన్ ప్రాజెక్ట్ లే. మరో రెండేళ్ల వరకూ తీరిక లేదు ప్రభాస్ కి. కానీ అప్పుడే ఆ తర్వాత నటించబోయే సినిమా చర్చలు జరుగుతున్నాయని టాక్.

ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్…ప్రభాస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. హృతిక్‌ రోషన్‌ హీరోగా ‘బ్యాంగ్‌ బ్యాంగ్, వార్‌’ సినిమాలు తీసిన సిద్ధార్థ్‌ ఆనంద్ డైరెక్షన్లో… ప్రభాస్‌ కథానాయకుడిగా ఓ భారీ యాక్షన్‌ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి చర్చలు కూడా పూర్తయినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సైన్ చేసిన సినిమాలు, డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ కమిట్‌మెంట్స్‌…కంప్లీటయ్యాక వీళ్లిద్దరూ కలిసి ముందుకెళ్తారట. సిద్ధార్ధ్ ఆనంద్ ప్రెజెంట్ షారుక్‌ ఖాన్‌తో ‘పతాన్‌’ తీస్తుండగా…ఆపై హృతిక్‌ రోషన్‌ హీరోగా ‘ఫైటర్‌’ తెరకెక్కిస్తారు. ఆ తర్వాతే ప్రభాస్‌తో సినిమా తెరకెక్కిస్తారట. ఈలోపు ప్రభాస్ కమిట్మెంట్స్ కూడా పూర్తవుతాయి. ఇదే నిజమైతే డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ప్రభాస్ ఈ సినిమాతో ఇస్తాడన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *