పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రెండు వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఒకటి ముందు నుంచి అనుకున్నట్టు కాస్త తెలిసిన వార్తే కాగా రెండవది రాజమౌళి తండ్రి…పవన్ కోసం కష్టపడుతుండటం. డైరెక్టర్ క్రిష్, పవర్ స్టార్ కాంబినేషన్ లో ఏఎం రత్నం నిర్మిస్తోన్న చిత్రానికి హరహర వీరమల్లు అనే టైటిల్ ఫిక్స్ చేసారు. 200 ఏళ్ళ కింద‌టి క‌థ‌తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇందులో ప‌వ‌ర్ స్టార్ వ‌జ్రాల దొంగ‌గా నటిస్తున్నారని, బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఔరంగజేబు రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా…మార్చి 11 మహాశివ‌రాత్రి సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా రివీల్ చేయబోతున్నారు.

ఇదిలాఉంటే మరోవైపు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్…ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కోసం కథను సిద్ధం చేస్తున్నారట. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలా రాజమౌళి సినిమాలకే కాకుండా రాజన్న, మెర్సల్, మణికర్ణిక, తలైవి వంటి సినిమాలకూ కథను అందించారు విజయేంద్రప్రసాద్. మరిప్పుడు ఏ డైరెక్షన్ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ చేస్తోన్న సినిమాకో తెలియదు కానీ…ఈ హీరోకి శక్తివంతమైన కథను మాత్రం రాస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *