అపోలో డిశ్చార్జ్ త‌ర్వాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు రజినీకాంత్. ఆయ‌న‌కోసం ఎంతగానో ఎదురుచూసిన భార్య ల‌తా హారతితో ఇంట్లోకి ఆహ్వానించి ముచ్చటించారు. అంతా బాగేనే ఉంది…త్వరలోనే రాజకీయ ప్రకటన కూడా రావాల్సిఉంది. ఈలోపు అన్నాత్తే షూటింగ్ కోసం హైదారాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు రజినీకాంత్. కూడ నయనతార కూడా విచ్చేసింది. ఇంతలో అన్నాత్తే సెట్ లో కొంతమందికి కరోనా సోకడం…షూటింగ్ ఆపేసి రజినీ హోటల్ కు చేరుకోవడం…రక్తపోటుతో తేడా రావడం…అపోలోలో చేరడం… అన్ని వెంటవెంటనే జరిగిపోయాయి. 

ఇదంతా బీజేపీ వృద్ధ నేత చేస్తున్న హైడ్రామాగా అభివర్ణించారు కొంతమంది. అపోలో ఆడుతున్న నాటకంగా సైతం కథలు చెప్పుకున్నారు. చివరికి ఏదైతేనేం మూడు రోజుల చికిత్స అనంతరం కోలుకున్న రజినీ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. తన కుమార్తెతో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం చెన్నైకి పయనమయ్యారు. రజినీ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. `తలైవా.. తలైవా..` అంటూ ఆయనకు స్వాగతం పలికారు. దీంతో రజినీ అభిమానులకు అభివాదం చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ముందుగా మాటిచ్చినట్టు రజినీ రాజకీయ ప్రకటన చేస్తారా లేదా అన్నది ఇప్పుడు అందరిలో ఉత్కంఠను రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *