ఆహాచిత్రం తాజాగా చెప్పినట్టు క్రేజీ కాంబినేషన్ కి ముహూర్తం కుదిరింది. బ్యాడ్ టైమ్ నడుస్తుందనుకుంటున్న డైరెక్టర్ శంకర్ తో కలిసి ప్రాజెక్ట్ మొదలెట్టబోతున్నారు మెగాపవర్ స్టార్. దీంతో శంకర్ – చరణ్ కాంబో గురించి జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమేనని తేలింది. డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబో మూవీ గురించి ఎన్నోరోజులుగా ఓ వార్త చక్కర్లుకొడుతుంది. అయితే దానిని నిజం చేస్తూ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ స్కూల్ నుంచి చెర్రీ హీరోగా ఓ క్రేజీ మూవీ రావడం ఖాయమైంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజుతో పాటూ రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించారు. ఇది దిల్ రాజు, శిరీష్ ల నిర్మాణంలో వస్తోన్న 50వ సినిమా కాగా, చెర్రీ నటిస్తోన్న 15వ సినిమా.

ప్రస్తుతం త్రిపుల్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ తో, ఆచార్యలో తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత రెండు సూపర్ ప్రాజెక్ట్స్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. అది మనం చెప్పుకున్నట్టు శంకర్‌దర్శకత్వం వహించే సినిమా కాగా మరొకటి జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే ప్రాజెక్ట్ అని సమాచారం. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియన్ స్థాయిలో మలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తోన్న భారతీయుడు 2కి ఆది నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఓ పట్టాన ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో మరో మూవీ కోసం ప్లాన్ చేస్తున్న శంకర్…రామ్ చరణ్ ను తన స్క్రిప్ట్ తో లాక్ చేసారు. హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో మల్టీస్టారర్ గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో చెర్రీతో పాటూ కేజీఎఫ్ యష్, విజయ్ సేతుపతి కూడా కనిపిస్తారని టాక్. 2022లో పట్టాలెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఈ ఫిబ్రవరి 14న ప్రకటించనున్నారు మేకర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *