2021లో స్పీడ్ పెంచారు టాలీవుడ్ హీరోలు. నెమ్మదిగా కాదు…ఒక్కో సినిమాను పరుగెత్తించాలనే పథకం రచిస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఈ రేసులో వెనుకపడుతారా అన్న ప్రశ్న ఇప్పుడు అభిమానులని వెంటాడుతుంది. రాజమౌళి తర్వాత శంకర్…త్రిపుల్ ఆర్ తర్వాత చెర్రీ మూవీ కోసం మరో మూడేళ్లు వెయిట్ చేయాలా అన్న ఆందోళన మొదలైంది. మరి సంవత్సరాల తరబడి సినిమాను పొడిగించే శంకర్ లాంటి డైరెక్టర్ని ఎలా…ఎవరు లైన్ లోకి తీసుకొస్తున్నారు?

స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబో అనగానే కాస్త భయపడుతున్నారు మెగాఫ్యాన్స్. శంకర్ తో సినిమా అంటే రెండూ, మూడేళ్ల సమయం పడుతుంది. ఓవైపు మిగిలిన హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతుంటే…శంకర్ డైరెక్షన్లో చెర్రీ లాక్ అయినట్టేనా అన్న చర్చ నడుస్తోంది. ఒక్కో మూవీకి ఎక్కువ టైం తీసుకునే రాజమౌళి… త్రిపుల్ ఆర్ ను త్వరగా తీసుకొద్దామనుకున్నా…కరోనా కారణంగా అదీ వెనక్కి వెళ్లింది. ఆపై శంకర్ తో ప్రాజెక్ట్.. మరి మెగాపవర్ స్టార్ పొజిషన్ ఏంటి అన్నది హాట్ టాపిక్ గా మారింది.

చరణ్, శంకర్ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేస్తుంది దిల్ రాజు. మూవీ కమిటైతే చాలు… పక్కా ప్రణాళికాతో వెళ్లే నిర్మాత ఆయన. ప్రతి సినిమాను ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి చూసుకునే దిల్ రాజు… ఇదే ఫార్ములాను శంకర్‌-చెర్రీ ప్రాజెక్ట్ విషయంలోనూ పాటిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న సమయానికి చేసి తీరాల్సిందేనని పట్టుమీదున్నారు. ఇవే అంశాలను శంకర్‌ కి సైతం దిల్ రాజు కన్వే చేసారాని టాక్. సినిమా మేకింగ్‌ విషయంలో దిల్‌రాజు సూచనలను శంకర్‌ కూడా అంగీకరించినట్టు చెప్తున్నారు.

ప్రస్తుతం ఆర్ఆర్‌ఆర్‌, ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ఇవి పూర్తయిన వెంటనే శంకర్‌తో సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు ఈ మూవీలోని విలన్ రోల్ కోసం అటు రణ్ వీర్ సింగ్ తో, ఇటు విజయ్ సేతుపతితో చర్చలు నడుస్తున్నాయి. ఎవరో ఒకరు ఫైనలయ్యాక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. హీరోయిన్ గా రష్మిక ఫిక్స్ అయినట్టేనని టాక్. ఇలా అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎక్కడా ఆగేదేలేదంటున్నారు చెర్రీ, శంకర్, దిల్ రాజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *