1983వ సంవత్సరంలో కపిల్‌దేవ్‌ నడిపించిన ఇండియన్ క్రికెట్ టీమ్ విశ్వవిజేతగా ఎదిగి దేశ క్రికెట్‌ చరిత్రలో నవ శకానికి నాంది పలికింది. ఆనాటి భారత టీమ్‌ జర్నీని వెండితెరపై చూపించాలనే సంకల్పంతో 83 మూవీని తెర‌కెక్కించాడు డైరెక్టర్ క‌బీర్ ఖాన్ . విష్ణు ఇందూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ క‌పిల్ బ‌యోపిక్‌లో హీరో ర‌ణ్‌వీర్ సింగ్… కపిల్ దేవ్ గా నటిస్తున్నాడు. ఇక ఆయ‌న భార్య పాత్రను దీపికా పదుకొనె పోషిస్తుండటం విశేషం. సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో తాహీర్‌ రాజ్‌ భాసిన్, అప్పటి టీమ్ మేనేజర్‌ మాన్‌ సింగ్‌ రోల్ లో పంకజ్‌ త్రిపాఠి, క్రికెటర్స్ సందీప్‌ పాటిల్‌ గా ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్, శ్రీకాంత్‌ క్యారెక్టర్లో తమిళ్ యాక్టర్ జీవా కనిపించబోతున్నారు. ఇక ప‌లు మార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జూన్ 4న విడుద‌ల చేయ‌నున్నారు.

ఇదిలాఉంటే బాలీవుడ్‌ భామ దీపికా పదుకోనె సర్కస్‌కి వెళ్తారని సమాచారం.. అదీ కేవలం అతిథిగా మాత్రమే. రోహిత్‌ శెట్టి డైరెక్షన్లో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కస్‌’ మూవీలో దీపికా ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. రణ్ వీర్ సరసన పూజా హెగ్డే, జాక్వెలిన్ నటిస్తున్నారు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో భర్త కోసమే దీపికా ఈ నిర్ణయం తీసుకుందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *