టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించి ఆసక్తికర విషయం తెలుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ మొదలైంది. భీమ్, రామరాజు కలిసి పోరాటాన్ని మొదలెట్టారు. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తీసుకొచ్చేలా క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం అంతే కష్టపడుతున్నారట.
ఇక క్లైమాక్స్ పోరాటం పూర్తవుతే…దాదాపు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ముగిసినట్టే. చిన్న చిన్న ప్యాచప్ వర్క్ కంప్లీట్ చేసుకుని రాజమౌళి గ్రాఫిక్స్ విభాగంలో కూర్చుంటారు. ఎడిటింగ్ పనిపడతారు. అంతా త్వరత్వరగా పూర్తి చేసి ఎలాగైనా సరే జూలై 30వ తేదిన ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *