‘ఆర్ఆర్ఆర్’ కి సంబంధించి నేటి మధ్యాహ్నం 2గంటలకు క్రేజీ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు రాజమౌళి. కాగా ఆ విషయం ఏంటన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే జక్కన్న అనౌన్స్ చేస్తున్నది ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్. అవును విజయదశమి కానుకగా ‘2021 అక్టోబరు 8’న రిలీజ్ కానుంది ఆర్ఆర్ఆర్. దీంతో పాటూ ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక అందరూ అనుకున్నట్టుగానే దసరాకే సినిమా అని ఆల్రెడీ ఇందులో నటించే ఐరిష్ నటి పోస్ట్ చేసి డిలీట్ చేసేసింది. దీంతో ఇంక ఆలస్యం చేయకుండా రాజమౌళి నేరుగా రంగంలోకి దిగుతున్నారు.

వచ్చే నెల ఫిబ్రవరితో ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్ పూర్తవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ సన్నివేషాల షూట్ దాదాపు కంప్లీట్ అయింది. మిగిలిన కొన్ని సీన్స్ చిత్రీకరణ అయిపోయాక ఫిబ్రవరి ఎండింగ్ లో గుమ్మడికాయ కొడతారు. ఆ తర్వాత దాదాపు 6నెలల పాటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటారు రాజమౌళి. గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ వంటి వాటి కోసం జక్కన్న ఎలా పరితపిస్తారో అందరికీ తెలిసిందే. అందుకే షూటింగ్ అంతా ఒక ఎత్తు, పోస్ట్ ప్రొడక్షన్ ఒక ఎత్తు. రెండింటిని సమన్వయం చేసుకుంటారు కనుకనే రాజమౌళి దర్శకధీరుడిగా రాణిస్తున్నారు. సో ఏదైమైనా మధ్యాహ్నం 2గంటలకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ తో రానున్నారు రాజమౌళి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *