నక్సలైట్ నాయకుడిగా రానా కదంతొక్కనున్న విరాటపర్వం ఏప్రిల్ 30వ తేదీని బుక్ చేసుకుంది. ఆమధ్య రిలీజైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ తోనే ఆసక్తికరంగా మారింది. చిత్రం ప్రారంభమైన రోజు నుంచి హాట్ టాపిక్ గా మారినా…1990ల నాటి నక్సలిజం నేపథ్యాన్ని కనెక్ట్ చేసి ఇంట్రెస్టింగ్ గా మలచడంతో జనాల్లో ఉత్కంఠను రేపుతోంది. అడవుల్లో ఉంటూ మావోయిస్టులు జరిపిన పోరాటం, ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తున్న రానా రూపం, సాయిపల్లవి క్యారెక్టరైజేషన్, నందితాదాస్, ప్రియమణి, నివేదా పేతురాజ్… ఇలా విరాటపర్వంలో ఎవరికి వారే ప్రత్యేకం.

ఇలాంటి అతి ప్రత్యేక చిత్రాలు ఆవిష్కరిస్తూ గుర్తింపుతెచ్చుకున్న డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ ప్రాజెక్ట్ కోసం బాగా శ్రమిస్తున్నాడని టాక్. హీరోహీరోయిన్లను మునుపెన్నడూ చూడనట్టు ముస్తాబు చేయడంతో పాటూ ఈ మూవీ రిలీజ్ తర్వాత వేణు దర్శకత్వ ప్రతిభను చూసి జనం చప్పట్లు కొడతారనే గట్టినమ్మకాన్ని కనబరుస్తోంది చిత్రయూనిట్. ఇక డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. ఎస్.ఎల్.వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. మరి మంచి నటులను ఎంపిక చేసుకొని విరాటపర్వాన్ని సృష్టిస్తున్న వేణు ఉడుగుల ఏప్రిల్ 30న ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *