గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ శాకుంతలంలో హీరోయిన్ ఎవరన్నదానిపై కొంతకాలంగా సస్పెన్స్ నెలకొంది. ఎట్టకేలకు సమంతా ఆ రోల్ పోషిస్తుందని కొత్త సంవత్సరం వేళ అధికారికంగా ప్రకటించారు గుణశేఖర్. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ క్రేజీ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. 

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న శాకుంతలంలో తొలిసారి పౌరాణిక పాత్రలో నటించబోతుంది సమంతా. అయితే దుశ్యంత మహారాజుతో పాటూ మిగిలిన పాత్రలను ఎవరు పోషిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Video Copyrigth: Gunna Teamworks

విదేశీ భాషల్లోకి అనువాదమై అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న తొలి భారతీయ నాటకం ‘శాకుంతలం’. 1889లో ఈ నాటకం నార్వేజియన్‌, ఫ్రెంచ్‌, ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ వంటి 46 భాషల్లోకి అనువాదమైంది. ఇక కొంతకాలంగా సరైన హిట్ లేక డీలా పడిన గుణశేఖర్ శాకుంతలంతో తానేంటో ఇండస్ట్రీకి మరోసారి నిరూపించుకోవాలని కసితో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *