న్యూ ఇయర్ పార్టీ కోసం గోవాకు క్యూ కడుతుంది టాలీవుడ్. అందరికన్నా ముందు టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ నాగచైతన్య – సమంత గోవాకు చేరుకుని హల్చల్ చేస్తున్నారు. డిజైనర్ శిల్పారెడ్డి బ్యాచ్ తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్నారు. బి రోమన్ ఇన్ రోమ్ అన్నట్టు బీచ్ డ్రెస్సులతో సమంతా రచ్చచేస్తుంది. ఇక వీరి దారిలోనే విజయ్ దేవరకొండ, రష్మికా, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సందీప్ కిషన్ వంటి వారు ఇప్పటికే గోవాకు చేరుకొని న్యూ ఇయర్ పార్టీ షురూ చేసారు.

టాలీవుడ్ కథ అలా ఉంటే బాలీవుడ్ స్టోరి వేరేలా ఉంది. బీ టౌన్ జంటలన్నీ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటున్నాయి. నో సింగిల్ పార్టీ విత్ మింగిల్ అన్నట్టు రణ్ బీర్ – అలియా…రణ్ వీర్ – దీపికా జంటలు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి కొన్ని రోజుల క్రితమే జైపూర్ చేరుకున్నాయి. అటు నుంచి అటు ఏదో పెద్ద ట్రిప్ వేసే ఆలోచనలో కూడా ఉన్నాయట. ఇక సిద్దార్ద్ మల్హోత్రా – కియారా అద్వానీ, ఇషాన్ ఖత్తార్ – అనన్య పాండే కపుల్స్ మాల్దీవుల్లో వేడి పుట్టిస్తున్నారు. అక్కడ అడుగుపెట్టింది ఆలస్యం… బీచ్ దుస్తుల్లో కియారా హాట్ ఫోజుచ్చింది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అయ్యేలోపు ఈ జంటలు ఇంకెంత రెచ్చిపోతాయో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *