షారూఖ్ ఖాన్ …బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయకపోయినా క్రేజ్ లో మాత్రం ఎలాంటి ఛేంజ్ కనిపించదు. రెండేళ్లుగా ఒక్క మూవీ రిలీజ్ లేకుండా ఖాళీగా ఉన్న బాద్షా.. ఈమధ్యనే పఠాన్ మూవీని పట్టాలెక్కించాడు. చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ హీరోగా వస్తోన్న సినిమా కావడంతో ఫ్యాన్స్… పఠాన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు పఠాన్ సినిమాకు సంబందించిన షారూఖ్ షాకింగ్ రెమ్యూనరేషన్ సంగతి ఇండియా వైడ్ గా సెన్సేషన్ అయింది.

డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ తెరకెక్కిస్తున్న పఠాన్ మూవీకి షారూఖ్ ఏకంగా 100 కోట్ల రూపాయల హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇది అఫీషియల్ అని స్పష్టం చేసారు బాలీవుడ్ పెద్దలు. అంతేకాదు… No number from the past matters, no number in the future is too big! The whole world is waiting to watch @iamsrk! అంటూ షారుఖ్ ని ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లను పక్కకు నెట్టేసి ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా 100 కోట్ల రెమ్యూనరేషన్ తో రికార్డ్ క్రియేట్ చేశారు షారూఖ్ ఖాన్ .

యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న పఠాన్ మూవీ లోని ఓ ఫైట్ సీన్ ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాపై షూట్ చేసారు. అంతేకాదు ..ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో షారుఖ్ తో పాటూ దీపికా పడుకోన్, జాన్ అబ్రహం లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *