తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేసిన శర్వానంద్‌ శ్రీకారం యూట్యూబ్ ట్రెండింగ్ నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఎప్పటిలాగే ఓ డిఫరెంట్ కథాంశంగా తెరకెక్కిన శ్రీకారంతో మనమందుకు వచ్చారు శర్వానంద్. అంతేకాదు ఈ హీరో రైతుగా కనిపిస్తోన్న ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి సైతం పెద్దపీట వేసారట డైరెక్టర్ బి.కిశోర్. మార్చి 11న మహాశివరాత్రి కానుకగా విడుగలకు సిద్ధమైందీ సినిమా.

హీరోయిన్ ప్రియాంక అరుళ్‌ మోహన్ శర్వాకి జంటగా నటించింది. నరేశ్, ఆమని, సాయికుమార్, రావురమేశ్‌, మురళీశర్మ, సప్తగిరి వివిధ పాత్రల్లో నటించారు. మిక్కీ జే.మేయర్‌ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ పాటలు ఇప్పటికే పాపులరయ్యాయి. 14రీల్స్‌ ప్లస్‌ బ్యావర్ పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేసారు. భలేగుంది బాల, సందళ్లే..సందళ్లే పాటలతో పాటూ రీసెంట్ గా రిలీజైన శ్రీకారం టీజర్ సైతం ప్రేక్షకులని బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి.

Source: 14 Reels plus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *