ఎన్నో ఆశలతో హీరో కావాలని ముంబైలో అడుగుపెట్టారు సోనూ సూద్. కానీ తానొకటి తలిస్తే అన్నట్టు హీరో కాస్త విలన్ గా మారి సౌత్ ఇండస్ట్రీలోనూ మెప్పించారు. అయితే అనూహ్యంగా కరోనా వేళ 2020లో ప్రజల హృదయాల్లో నిజమైన హీరోగా పేరు సంపాదించారు. వలస కార్మికుల కన్నీటిని తుడిచిన దగ్గరి నుంచి తనకు చేతనైనంత సాయం చేస్తున్న సోనూ సూద్ ఇప్పుడు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.

నిర్మాతగా తొలి అడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు సోనూ సూద్. దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయట. ప్రజల్లో స్ఫూర్తి నింపే చిత్రాలు, తాను అనుకున్న కథల కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారట. అన్నీ కుదిరితే త్వరలోనే నటుడిగా, నిర్మాతగా ప్రేక్షకులని అలరిస్తానని ప్రకటించారు. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పుకోవాలి. ఇప్పటికే అంగీకరించిన సినిమాల్లో సోనూ సూద్ ను విలన్ గా చూపించేందుకు భయపడుతున్నారట దర్శకనిర్మాతలు. ప్రేక్షకులు అంగీకరించరన్న భావనతో సోనూ పాత్రను తిరగరాస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *