అసలే కరోనాతో 2020లో సినిమాల్లేక సినీ ఇండస్ట్రీ కుదేలైంది. దానికి తోడు ప్రముఖుల మరణాలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. కొందరి సూసైడ్..మరికొందరి హఠాన్మరణాలు…ఏదేమైనా అభిమానుల చివరి చూపు సైతం లేకుండా సినీప్రపంచం నుంచి అనంతలోకాలకు చేరుకున్న స్టార్స్ ని ఓసారి తలచుకుందాం.

2020…ప్రతి ఏడాదిలాగే మొదలైంది. ఎన్నో ఆశలు…మరెన్నో కోరికలతో మరో ఏడాదిలోకి అడుగుపెట్టింది సినీ ఇండస్ట్రీ. కానీ కరోనా ఒక్కసారిగా కమ్మేయడంతో ఎక్కడివక్కడ సర్దేసింది. 

ఆపై వరుస మరణాలు…ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాయి.

ఒక్క మరణం…కరోనా వేళ బిక్కుబిక్కమని కాలం గడుపుతున్న జనాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎన్నో ప్రశ్నలను పుట్టించింది. ఎందరినో ముద్దాయిలుగా నిలబెట్టింది. అనేక అనుమానాలు, అంతుపట్టని రహస్యాలు…ఎక్కడో మొదలై ఎక్కడికో చేరింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అవును సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం… 2020లో ఓ తీరని విషాదం.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్…మరణించిన తర్వాత దేశమంతా మార్మొగిన పేరిది. జూన్ 14న తన ఫ్లాట్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ వయసు కేవలం 34ఏళ్లు. ఎం.ఎస్.ధోనీ, కేధారనాథ్, చిచోరే వంటి సినిమాలు చూస్తే సుశాంత్ ప్రతిభ ఎలాంటిదో అర్థమవుతుంది. 

కేవలం నటుడిగానే కాదు…చదువు, డాన్స్, సామాజిక సేవల్లో సైతం ముందుండేవాడు సుశాంత్. అయితే సుశాంత్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆయన చనిపోయిన తర్వాత ఓటీటీలో రిలీజైన దిల్ బెచరా ఈ ఏడాది అరుదైన రికార్డులను సాధించింది. అత్యధికులు వీక్షించిన సినిమాగా, గూగుల్ లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాగా, ట్విట్టర్ ట్రెండింగ్ మూవీగా క్రెడిట్స్ దక్కించుకుంది. 

దేశం గర్వించదగ్గ నటుడు..తన సహజ నటనతో ఆకట్టుకున్న ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29న తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసిన ఈయన దక్షిణాది భాషల్లోనూ పలు సినిమాల్లో నటించారు. స్లమ్ డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *