ఒక్క మరణం…కరోనా వేళ బిక్కుబిక్కమని కాలం గడుపుతున్న జనాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎన్నో ప్రశ్నలను పుట్టించింది. ఎందరినో ముద్దాయిలుగా నిలబెట్టింది. అనేక అనుమానాలు, అంతుపట్టని రహస్యాలు…ఎక్కడో మొదలై ఎక్కడికో చేరింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అవును సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం… 2020లో ఓ తీరని విషాదం. నేడు సుశాంత్ సింగ్ జన్మదినం. అందుకే యావత్ భారతదేశ ప్రేక్షకలోకం…ఆ నటుడిని గుర్తుచేసుకుంటుంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్…మరణించిన తర్వాత దేశమంతా మార్మొగిన పేరిది. జూన్ 14న తన ఫ్లాట్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బీహార్ లోని పాట్నాలో జనవరి 21న జన్మించిన సుశాంత్ వయసు కేవలం 34ఏళ్లు. ఎం.ఎస్.ధోనీ, కేధారనాథ్, చిచోరే వంటి సినిమాలు చూస్తే సుశాంత్ ప్రతిభ ఎలాంటిదో అర్థమవుతుంది. కేవలం నటుడిగానే కాదు…చదువు, డాన్స్, సామాజిక సేవల్లో సైతం ముందుండేవాడు సుశాంత్. అయితే సుశాంత్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో భాగంగా బయటికొచ్చిన డ్రగ్స్ బాగోతం బాలీవుడ్ నే కాదు…దక్షిణాది పరిశ్రమను షేక్ చేసింది. ఆయన మరణం తర్వాత ఓటీటీలో రిలీజైన దిల్ బెచరా గతేడాది అరుదైన రికార్డులను సాధించింది. అత్యధికులు వీక్షించిన సినిమాగా, గూగుల్ లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాగా, ట్విట్టర్ ట్రెండింగ్ మూవీగా క్రెడిట్స్ దక్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *