ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ నటించిన చిత్రం… తెరవెనుక. జనవరి 1 కొత్త సంవత్సర కానుకగా విడుదల కానుంది. సామాజిక పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమన్ సరసన విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లు కాగా… ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టిఎన్ఆర్ , శ్వేత వర్మ , సంపత్ రెడ్డి వంటి వారు ఇతర నటీనటులు. మురళి జగన్నాథ్  మచ్చ నిర్మిస్తున్నారు  తెరవెనుక చిత్రాన్ని. డెసెంబరు 13న మూవీ ఆడియో రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉమెన్స్ & చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ డి.ఐ.జి.సుమతి , దర్శకుడు ఎన్ శంకర్, సుచిర్ ఇండియా లయన్ కిరణ్ విచ్చేసి సినిమా విజయవంతం కావాలని ఆశించారు.

ఇప్పటికే రిలీజైన తెరవెనుక ట్రైలర్ చాలా రియలిస్టిక్ గా ఉందనే ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం ట్రైలర్ తనను ఆకట్టుకుందని..ఒక ఆడపిల్ల తండ్రి, తన కూతురు కు జరిగిన అన్యాయం గురించి కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు  దానికి లేడీ పోలీస్ వివరించే విధానం బాగుంది. ఇందులో సీన్ చూస్తుంటే మహిళల పైన జరుగుతున్న అంశాలను ఇందులో చూపించినట్లు తెలుస్తుందని తెరవెనుకను కొనియాడారు డి.ఐ.జి.సుమతి.

పోలీస్ డిపార్ట్మెంట్ తెరవెనుక చేసే త్యాగాలు, పోరాటాలను ఈ సినిమాతో ప్రెజంట్ చేస్తున్నారు. రఘురామ్ చక్కటి సంగీతం , కాసర్ల శ్యామ్ రాసిన పాటలు మంచి పేరు తెచ్చుకున్నాయి. నిర్మాత మురళి జగన్నాథ మచ్చ తెరవెనుక ఉండి నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటుంది చిత్రయూనిట్. అలాగే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సైతం తన తమ్ముడి మొదటి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని విషెస్ తెలియజేసారు. సమాజంలో జరుగుతున్న నిత్యకృత్యాలను ధైర్యంగా తెరకెక్కించిన తెరవెనుకలో ఎంత విషయముందో తెలియలాంటే జనవరి 1 వరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *