‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2 సిరీస్ తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు సమంతా. నిజానికి ఫిబ్రవరి 12వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సరికొత్త సిరీస్‌ రిలీజ్‌ కావాల్సిఉంది. అయితే నిన్నటివరకు ఎలాంటి వాయిదా లేదని ప్రకటించిన మేకర్స్…హఠాత్తుగా ఈ సిరీస్ ను సమ్మర్ కి వాయిదా వేస్తున్నట్టు చెప్పేసారు. డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే రూపొందించిన సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ మొదటిభాగంలో మనోజ్‌ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించగా…సేమ్ అదే కాంబినేషన్ సెకండ్ సీజన్ లోనూ రిపీట్ అవుతోంది. కాగా టాలీవుడ్ క్వీన్ సమంత విలన్‌ పాత్రలో టెర్రరిస్ట్ గా కనిపించబోతున్నారు.

ఇంతవరకు సామ్ కి సంబంధించిన పార్ట్ ని చాలా గోప్యంగా ఉంచింది యూనిట్. డైరెక్ట్ స్క్రీన్ మీదే సర్ప్రైజ్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇక ఈ సిరీస్ వాయిదా గురించి డైరెక్టర్స్ మాట్లాడుతూ – ‘ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని తెలుసు. మీ అందరికీ ఓ సరికొత్త అనుభూతిని అందించాలనే విడుదలను వేసవికి వాయిదా వేసాం’ అని అన్నారు. అయితే రీసెంట్ గా ఓటీటీ ప్రైమ్‌లో రిలీజైన ‘మిర్జాపూర్‌’, ‘తాండవ్‌’ సిరీస్‌లు వివాదాల్లో చిక్కుకుని…దేశవ్యాప్త చర్చని రేకెత్తించాయి. అందుకే ‘ఫ్యామిలీ మ్యాన్‌’ విషయంలో అలాంటివి ఎదురుకాకూడదనే ఆలోచనతోనే ఇలా ఫిబ్రవరి 12 నుంచి వేసవికి వాయిదా వేసారని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *