గని…బాక్సింగ్ డ్రామా నేపథ్యంలో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ నటిస్తోన్న 10వ సినిమా. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీ జూలై 30 అని ప్రకటించారు. ప్రభాస్ రాధేశ్యామ్ కూడా అదే రిలీజ్ డేట్ ను బుక్ చేసుకోవడంతో గని వెనక్కితగ్గుతాడామే చూడాలి. సరే ఏదేమైనా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది గని చిత్రం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండగా…క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర గని టీంతో చేతులు కలిపారు. ఆయ‌నకు మూవీ యూనిట్ పుష్ప‌గుచ్ఛంతో స్వాగ‌తం ప‌లికింది. ఉపేంద్ర ప‌వర్‌ఫుల్ పాత్ర‌లో వరుణ్ తేజ్ తండ్రిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ బ్యానర్లపై అల్లు బాబీ, సిద్ధు ముద్దా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలీవుడ్ గర్ల్ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి బాక్సింగ్ కోచ్ గా నటిస్తుండగా…వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా… మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *