రౌడీబాయ్, లేడీడాల్ కలిసి మరోసారి కనిపించబోతున్నారని టాక్. విజయ్ దేవరకొండతో కలిసి రష్మికా మందన్నా మెరవనుందని అంటున్నారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో సూపర్ పెయిర్ అనిపించుకున్న ఈ జంటను డైరెక్ట్ చేయబోయేది టాలీవుడ్ లెక్కల మాస్టారు. అవును సుకుమార్, విజయ్ కాంబోమూవీలో రష్మికాను ఫైనల్ చేసారట. ప్రస్తుతం పుష్ప కోసం కష్టపడుతోన్న రష్మిక ఎనర్జీకి ఫిదా అయిన సుకుమార్…తన నెక్ట్స్ సినిమాలో కూడా రష్మికనే తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ నెక్ట్స్ సినిమా హీరో విజయ్ దేవరకొండ కావడంతో వీరి జంట మరోసారి కలిసే అవకాశం లభించింది.

ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్ చేస్తోన్న విజయ్ దేవరకొండ..ఆ తర్వాత నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో ఓ మూవీకి సైన్ చేసారు. ఈ ప్రాజెక్ట్ తర్వాతే సుకుమార్ బడిలో చేరనున్నాడు. ఇక అప్పుడే వీరిద్దరితో కలిసి రష్మికా కొత్త పాఠాలు నేర్చుకోనుంది. ఓ వైపు సౌత్ టు నార్త్ వరు కమిట్మెంట్లతో బిజీగా ఉంది రష్మికా. ఆమెకు కూడా కొత్త సినిమాల్లో అడుగుపెట్టడానికి మరో సంవత్సరం పడుతుంది. దీంతో వచ్చే ఏడాది సుకుమార్ దర్శకత్వంలో రౌడీబాయ్, రష్మికా కలిసి నటిస్తారామో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *