పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ప్యాన్ ఇండియా మూవీ కోసం విజయ్ దేవరకొండ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించేందుకు బాగా కష్టపడుతున్నానని ఓ వీడియోను రిలీజ్ చేసాడు. విజయ్ దేవరకొండ ఏం చేసినా న్యూస్ గా మారుతుంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. క్రిస్మస్ కి శాంటాగా మారి కానుకలు పంచినా…తన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టీంతో కలిసి టైం స్పెండ్ చేసినా….ఇప్పుడిలా జిమ్ లో కసరత్తులు చేస్తున్నా ప్రతిరోజూ విజయ్ కి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ గా మారాల్సిందే.

యంగ్ సెన్సేష‌న్ విజయ్ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో ఫైట‌ర్ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ న‌టి అన‌న్య‌పాండే ఇందులో హీరోయిన్. గ‌తంలో ఈ మూవీకి సంబంధించి విడుద‌లైన స్టిల్ ఒక‌టి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ సాంటాక్యాప్ పెట్టుకుని జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న వీడియో ఆన్ లైన్ లో సందడి చేస్తుండగా…దానిని పూరీ జ‌గ‌న్నాథ్ ట్విట‌ర్ లో షేర్ చేసాడు..ద‌టీజ్ మై హీరో, ద‌టీజ్ మై ఫైట‌ర్..నువ్వు న‌న్ను గ‌ర్వ‌ప‌డేలా చేశావ్‌. లవ్ యూ విజ‌య్ అంటూ కామెంట్ ఇచ్చాడు. దీంతో విజ‌య్‌పూరీ మ‌ళ్లీ షూటింగ్ తో బిజీ అయిపోయిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *