హీరో పాత్రలే కావాలని ఒకరు, కథానాయికగానే మెప్పించాలని మరొకరు ఎప్పుడూ ఎదురుచూడరు. పాత్ర నచ్చితే ఎలాంటిదైనా, ఎంత నిడివి ఉన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కలకాలం ఆ రోల్…రోల్ మోడల్ అయ్యేలా కష్టపడైనా సరే నటించి చూపిస్తారు. వాళ్లే విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్. అసలు ఓవైపు హీరోగా చేస్తూనే…మరోవైపు తండ్రి పాత్ర అది కూడా టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించాలంటే ఎవరూ సాధారణంగా ముందుకు రారు. కానీ విజయ్ సేతుపతి వచ్చారు. ఉప్పెనతో ఇరగదీసారు. వహ్వా అనిపించారు. అలాగే నడి వయస్సు పాత్రలో రౌడీగా కనిపించాలంటే ఏ హీరోయిన్ అంగీకరించదు. కానీ క్రాక్ తో కిర్రాక్ పుట్టించారు వరలక్ష్మీ శరత్ కుమార్.

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో ఇప్పుడు వీళ్లిద్దరి గురించే చర్చ నడుస్తోంది. ఎలా ఇలా నటించగలుగుతున్నారనే ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు స్టార్ నటులు, దర్శకులు. హీరోగా, విలన్ గా, తండ్రిగా చివరికి సూపర్ డీలక్స్ చిత్రంలో ట్రాన్స్ జెండర్ గా కూడా నటించి నిజమైన హీరో అనిపించారు విజయ్ సేతుపతి. ఇప్పుడిక నాలుగు అడుగులు ముందుకు వేసి ఈయన బాలీవుడ్ బాట పడుతుంటే…వరలక్ష్మీని లేడీ విజయ్ సేతుపతి అన్న ట్యాగ్ లైన్ తో ఇప్పుడిప్పుడే సౌత్ మొత్తం గుర్తిస్తోంది. అల్లరి నరేశ్ నాంది సినిమాలో లాయర్ గా అద్భుతమైన నటనను ప్రదర్శించారట వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడామెకు వరుసగా ఆఫర్లు క్యూకడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *