సినిమా హాళ్ల రీఓపెనింగ్ కోసం కొన్ని పెద్ద సినిమాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. వాటిలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ ది తొలి స్థానం . గత నెలలో రిలీజైన మాస్టర్ తమిళ్ ట్రైలర్ ఎంతలా ట్రెండ్ సృష్టించిందో తాజాగా విడుదలైన ఈ మూవీ తెలుగు ట్రైలర్ సైతం అంతే సందడి చేస్తుంది. మామూలుగా ప్రతి ఏడాది విజయ్ నుంచి కనీసం ఒక్క సినిమా అయినా వస్తుంటుంది. కానీ లాక్ డౌన్ కారణంగా 2020లో అది కుదరలేదు. దాంతో ఆయన అభిమానులే కాదు తమిళ సినీ ప్రేక్షకులు అందరూ విజయ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అందుకే ‘మాస్టర్’ చిత్రాన్ని థియేటర్లు తెరుచుకున్న వెంటనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

Video Copyright: Gemini TV

ముందుగా 2021 సంక్రాంతి కానుకగా మాస్టర్ రాబోతున్నాడని ప్రకటించారు. అయితే ఖచ్చితమైన తేదీ ఇదీ అని చెప్పలేదు. చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం జనవరి 13న విడుదల తేదీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్త విన్న విజయ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. సేతుపతిది ప్రతినాయక పాత్ర, సపోర్టింగ్ క్యారక్టెరా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు విజయ్ సేతుపతికి సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అందుకే మాస్టర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *