విజయశాంతి…హీరోయిన్ గానే కాదు లేడీ అమితాబ్ గా పేరుతెచ్చుకున్న సహజనటి. సినిమాలో తన పాత్రకు ఓ విలువుండి…నచ్చితేనే అంగీకరిస్తారు. గతేడాది మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరుతో టాలీవుడ్ పరిశ్రమకు రీఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. ఆ తర్వాత చాలామంది దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించారు కానీ వారికి నిరాశే మిగిలింది. దేవకట్టా సైతం సాయి ధరమ్ తేజ్ మూవీ రిపబ్లిక్ కోసం విజయశాంతిని సంప్రదిస్తే…సున్నితంగా తిరస్కరించారని చెబుతారు. చివరికి ఆ పాత్రలో రమ్యకృష్ణను సెట్ చేసారట దేవకట్టా. అయితే అలాంటి విజయశాంతి ఇప్పుడు మరో సినిమాకు సైన్ చేసారనే వార్త ఆసక్తిని కలిగిస్తుంది.

ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన భారతరత్న సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రాన్ని నిర్మించిన ప్రతిమా ఫిల్మ్స్.. తాజాగా ఆమె కోసం ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ సిద్ధం చేయించిందట. దేశభక్తి నేపథ్యంలో పూర్తిగా కశ్మీర్‌లోనే సాగే ఈ సినిమా స్క్రిప్ట్ విజయశాంతికి బాగా నచ్చిందని సమాచారం. అందుకే వెంటనే ఆమె ఒప్పుకున్నారని కూడా తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట ప్రతిమా ఫిల్మ్స్ నిర్మాతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *