సంక్రాంతికి సరుకును దించుతున్నారు రానా, సాయిపల్లవి. అయితే డైరెక్ట్ సినిమాలతో కాదు…రాబోయే చిత్రాల ఫస్ట్ లుక్, టీజర్స్ తో. ఇప్పటికే ‘అరణ్య’తో రానా, ‘లవ్ స్టోరీ’తో సాయిపల్లవి బజ్ క్రియేట్ చేసారు. కాగా భోగిరోజున ఇద్దరు కలిసి ‘విరాటపర్వం’ స్టిల్ లో కనిపించారు. నక్సలైట్ వేషంలో కనిపిస్తున్న రానా చేతిని పట్టుకుని.. ఓరగా నవ్వుతూ చూస్తోంది సాయిపల్లవి. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


డైరెక్టర్ వేణు ఊడుగుల తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని డి.సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి కలిసి నిర్మిస్తున్నారు. హీరోయిన్ ప్రియమణి కామ్రేడ్‌ భారతక్కగా ఓ పవర్ఫుల్ రోల్ చేస్తోంది. ‘ ఓ మహా సంక్షోభం కూడా గొప్ప శాంతికి బాటలువేస్తుందని నమ్మింది భారతక్క. ఫ్రెంచ్‌ రెవల్యూషన్‌లో విద్యార్ధుల పాత్ర ఎంతటిదో… ‘విరాటపర్వం’ సినిమాలో కామ్రేడ్‌ భారతక్క కూడా అంతే ముఖ్యమని’ డైరెక్టర్ వేణు ఊడుగుల వెల్లడించారు.
వర్సటైల్ యాక్ట్రస్ నందితాదాస్‌, జరీనా వాహబ్, సాయిచంద్, నవీన్‌ చంద్ర, ఈశ్వరీరావు వంటి వారు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తుండగా, ఈ మూవీకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు. గతేడాదే షూటింగ్ పూర్తైనా… రిలీజ్ కరోనా కారణంగా వాయిదా ప‌డింది. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో విరాటపర్వం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *