సుమ…ప్రత్యేకంగా పరిచయం అవసరం లేనిపేరు. చంటోడి దగ్గర నుంచి ఇంట్లోని పండు ముసలమ్మ వరకూ సుమ తెలియని ఫ్యామిలీ ఉండటం చాలా అరుదు. నవ్వుకున్నా ఇది నిజం. కేరళ ఫ్యామిలీ అయినా హైదరాబాద్ లో పెరిగి…కనకాల కుటుంబంలో అడుగిడి తెలుగింటి కోడలైంది ఆమె. చిన్నప్పటి నుంటి కళల పట్ల ఆసక్తి ఉన్న సుమ… హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాలో హీరోయిన్ గానూ చేసారు. కానీ కలిసిరాలేదు. ఆ తర్వాత సినిమాల్లో ఏవో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా…అసలైన పేరు తెచ్చింది మాత్రం టెలివిజన్ రంగమే.

Suma kanakala rare photo career starting
source: Teluguone

అప్పట్లో దూరదర్శన్ ఛానల్ లో సుమ నటించిన సీరియళ్లు, నాటికలు ఎన్నో ప్రసారమయ్యాయి. ఆ తర్వాత ఈటీవీ, జెమిని ఛానళ్ల రాకతో అక్కడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది సుమ. ఇదే సమయంలో రాజీవ్ కనకలతో ప్రేమలో పడి…సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది. రాజీవ్ ను చేసుకున్నాక…పిల్లలు పుట్టాక కొంతకాలం సుమ కనబడకపోయేసరికి ఆమె పనైపోయింది అనుకున్నారు. నిజానికి కొంత కాలం కష్టాలను సైతం చవిచూసారామే. విజయవాడ సిటీ ఛానల్ లో యాంకర్ గా పనిచేసారు. కానీ జెమిని టీవీలో లైవ్ ప్రోగ్రాం ‘పట్టుకుంటే పట్టుచీర’తో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. సేమ్ టైం కొన్ని ప్రత్యేక వేడుకలకు యాంకరింగ్ చేసే అవకాశం సైతం సుమకు రావడంతో తానేంటో నిరూపించుకున్నారు. అలాంటిదే ‘తెలుగు సినిమా వజ్రోత్సవాలు’, ‘మాటీవీ అవార్డ్స్’….ఇలా మరికొన్ని.

suma rajeev kanakala family
Source: ETV

సుమ కెరీర్ లో బూస్టప్ ఇచ్చిన మరో కార్యక్రమం ‘అవాక్కయ్యారా’. ఈ లైవ్ షోలో సుమ వేసిన వేషాలు…ఇంతవరకూ ఏ యాంకర్ వేయలేదనడంతో అతిశయోక్తి లేదు. అటు సేమ్ టైం ఈటీవీతో ప్రసారమైన ‘మహిళలు..మహరాణులు’…దానికే పేరు ‘స్టార్ మహిళ’గా మార్చారు. ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నందుకు గానూ స్టార్ మహిళ స్థానం సంపాదించంటే సుమ ఎనర్జీని అర్ధం చేసుకోవచ్చు.

Suma-Kanakala-Images ramoji rao garu limca book of records

ఇక అప్పటి ‘ఆడియో రిలీజ్’ దగ్గరి నుంచి నేటి ‘ప్రీ రిలీజ్’ ల వరకూ సుమ లేకుండా ఏ పెద్ద హీరో ఫంక్షన్ జరుగదని అందరికీ తెలిసిందే. ఎన్నిసార్లు చూసినా, ఎంతగా విన్నా బోర్ కొట్టకుండా సుమ చేసే స్పాంటేనిటీ మాయే ఇన్నేళ్ల నుంచి ఆమెను మనం బంధువుగా మార్చుకునేలా చేసింది. ‘పంచావతారం’, ‘భలే ఛాన్సులే’, ‘జీన్స్’, ‘క్యాష్’, ‘సూపర్ సింగర్’…ఇలా ఒకటా, రెండా ఆమె చేసిన కార్యక్రమాలు ఎన్నో. సినీ ఇండస్ట్రీలో ఆమెకు అందరూ బంధువులే. మా ఫంక్షన్ సుమ హోస్ట్ చేస్తుందంటే మాకు భయం ఉండదంటారు స్టార్ హీరోలు. సుమ ఇంటర్వ్యూ చేయాలి, సుమ యాంకర్ గా ఉండాలి, సుమ పంచ్ లేయాలి, సుమ మీద పంచ్ లేయాలి…ఇలా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆమె కావాలంటున్నారంటే…అది కేవలం ఆమె టాలెంట్ కారణంగానే.

Source: Filmy Focus

ప్రీరిలీజ్ ఫంక్షన్స్, ప్రతి ఛానల్లో ఆమె కనిపించే ప్రాగ్రామ్స్, ఇంటర్వ్యూలు…యూట్యూబ్ ఛానళ్లలో రచ్చ…ఇలా ఎక్కడ చూసినా సుమ తనకి తానే సాటి…తనకి తానే పోటీ. తనని ఆదర్శంగా తీసుకొని ఎందరో యాంకర్స్ వస్తున్నారు కానీ ఎవ్వరూ తనని దాటలేకపోతున్నారు. పైకి కనిపించేంత సంతోషం ఆమెకు వ్యక్తిగత జీవితంలో అంతగా లేదు. అలా అని తనది అంతులేని కథ టైప్ విషాధభరిత స్టోరీ కాదు. ఎందుకో, ఏమో…ఏదో బాధైతే సుమను వెంటాడుతుంది. రాజీవ్ తో హ్యాపీగానే ఉన్నానని పరోక్షంగా చెప్పేందుకు తన చేసే ప్రోగ్రామ్స్ అన్నింటికి తన భర్తను ఆహ్వానిస్తుంది. తాజాగా రాజీవ్ చేస్తోన్న రెచ్చిపోదాం బ్రదర్ ప్రోగ్రాంకి తాను హాజరై నవ్వులు పంచింది.

suma rajeev kanakala family
Source: Suma social media


మరోవైపు కొడుకు హీరోగా నిలబెట్టేందుకు సుమరాజీవ్ కష్టపడుతున్నారు. కొడుకును దారిలోకి తెచ్చి…హీరోగా ప్రవేశపెట్టేందుకు తానే నిర్మాతగా మారిందనే న్యూస్ వినిపిస్తోంది. అటు కూతురును బాగా చదివిస్తున్నారు. సరే ఏదేమైనా…మనందరికి నవ్వులు పంచుతున్న సుమకు…అంతా మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే సుమా….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *