ఇలా మొదలైంది

కరోనా లాక్ డౌన్ వేళ చాలామంది వంటలు, కసరత్తులు చేస్తూ కూర్చుంటే…కరోనానే ఎయిమ్ గా చేసుకొని జాంబిరెడ్డి సినిమాను ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అనౌన్స్ అయితే చేసాడు కానీ ఎలా మొదలైందో, ఎక్కడ షూటింగ్ చేసాడో మొత్తానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. క్రాక్ మినహా అన్ని సినిమాలు నిరాశపరచడంతో మంచి కాన్సెప్ట్ మూవీ కోసం ఎదురుచూస్తున్న జనంకోసం నేనున్నానంటూ వచ్చేసాడు జాంబిరెడ్డి. హాలీవుడ్ పాపులర్ కాన్సెప్ట్ జాంబీ కథాంశానికి కామెడీ టచ్ ఇచ్చి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏదో మ్యాజిక్ చేసాడన్న విషయం ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. అందుకే చైల్డ్ ఆర్టిస్త్ తేజా సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాపై తెలియకుండానే అంచనాలు పెరిగాయి.

ఇదీ కథ

వీడియో గేమ్స్ అంటే పడిచచ్చే హీరో తనకిష్టమైన ఆట పేరునే తనపేరుగా మార్చుకుంటాడు. ఫ్రెండ్స్ తో కలిసి గేమింగ్ లో ప్రయోగాలు చేస్తూ ఎప్పటికైనా గొప్పవాడిగా ఎదగాలని పరితపిస్తుంటాడు. అనుకోని కొన్ని సంఘటనల వల్ల హీరో ఒక ఊరికి వెళ్తాడు అసలు ఎందుకు హీరో ఆ ఊరికి వెళ్తాడు. వెళ్ళాక ఆ ఊర్లో జరిగిన సంఘటనలు ఏంటి ? పగ ప్రతికరాలతో నిత్యం కొట్టుకునే ఆ ఊరి జనం అనుకోకుండా వచ్చిన జోంబీ ల ప్రమాదం నుంచీ ఎలా తప్పించుకుంటారు చివరికి ఏం జరుగుతుంది ?హీరో చివరికి ఎం చేస్తాడు అనె ఆసక్తి కరమైన కథనం తొ ఈ కధ ముగుస్తుంది

ఇదీ నటన

చైల్డ్ ఆర్టిస్ట్ గా మెగాస్టార్ నుంచి సూపర్ స్టార్ వరకు దాదాపు అందరితో వరుసపెట్టి సినిమాలు చేసిన తేజా సజ్జలో హీరో మెటిరీయల్ ఉంది. ఓ బేబీ సినిమాతోనే వెండితెరకు డెబ్యూ ఇచ్చినప్పటికీ…ఆ మూవీని సమంతా స్టీల్ చేయడంతో సోలో హీరోగా తేజకు ఈ జాంబీ రెడ్డినే మొదటి చిత్రంగా చెప్పుకోవాలి. లుక్స్ పరంగా ఇంకా కుర్రతనమే కనిపిస్తోన్న తేజ సజ్జ ముందుముందు నటన పరంగా మెప్పించే అంశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమావరకైతే వంకబెట్టకుండా లాగించేసాడు. దక్ష నగార్కర్ కొద్ది సేపే కనిపిస్తుంది. బట్ బాగుంది. ఇక అందం, టాలెంట్ అన్నీఉన్నా తెలుగులో అవకాశాలు లేని ఆనంది తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తానేంటో నిరూపించుకుంది. రఘుబాబు, పృథ్వి, మహేశ్ విట్టా, అదుర్స్ రఘు, వినయ్ వర్మ, హరితేజ, కిరీటి తదితరులు ఎవరి పాత్రలను వారు బాగానే రక్తికట్టించారు. అందరికంటే అన్నపూర్ణమ్మ, గెటప్ శీను గుర్తుండిపోయేలా ఇరగదీసారు.

ఇదీ డైరెక్షన్

అ, కల్కి చిత్రాలతోనే తన అభిరుచేంటో నిరూపించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. రెగ్యూలర్ జోనర్ లో తన ఆలోచనలు ఇమడవు. కొత్తదనాన్ని కోరుకుంటాడు. అందుకే ఓ రకంగా జాంబీరెడ్డితో ఓ రకంగా రిస్క్ తీసుకొన్నాడు. హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవాళ్లకు తప్ప ఈ జాంబీ కాన్సెప్ట్ అనేది పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ పరిచయమున్న జాంబీలంటే థ్రిల్లర్, హారర్ జోనర్ గానే చాలామందికి తెలుసు. అందుకు విభిన్నంగా భయపెడుతూనే జాంబీలతో కామెడీ రాబట్టే ప్రయత్నం చేసాడు ప్రశాంత్ వర్మ. చాలావరకు సక్సెస్ అయ్యాడు కూడా.

మరీ ముఖ్యంగా ఇలాంటి కథలతో సౌత్ ప్రేక్షకులను థియేటర్స్ కు తీసుకురావడం కష్టం. కష్టపడి తీసుకొచ్చాక వాళ్లని సీటు కదలకుండా కట్టిపడేయాలి. ఇక్కడే కొంచెం టైం తీసుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఫస్ట్ హాఫ్ ను చాలా స్లోగా రాసుకున్న డైరెక్టర్…ఆసలైన కథకు ఇంట్రెవల్ వరకు వెయిట్ చేయించాడు. మొదటి భాగాన్ని కూడా స్పీడ్ రికవరీ ఇచ్చుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యుండేది. అయితే సెకండాఫ్ మొదలయ్యాక మాత్రం ప్రేక్షకుడికి ఆ లోటు కనిపించదు. అయితే వైరస్ వచ్చేందుకు సైంటిఫిక్ గా మంచి రీజన్ రాసుకున్న ప్రశాంత్ దాని ఎండ్ చేయడానికి మాత్రం సింపుల్ మార్గాన్ని ఎంచుకున్నాడా అనిపిస్తుంది. మంచి థ్రిల్లింగ్ అంశాలు , కామెడీని కలగలపి ఫైనల్ గా థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు మాత్రం బాగుంది అనుకుంటారు

ఇదీ మిగిలింది

సినిమాటోగ్రఫర్ కష్టం చాలావరకు కనిపించింది. అనిత్ అందించిన సినిమాటోగ్రఫీ జాంబీరెడ్డికి ప్లస్ అయింది. పాటలతో పెద్దగా పనిలేదు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా సౌండ్ అతి అనిపించినా ఓవరాల్ గా వంకపెట్టలేం. ఎడిటర్ సాయి బాబు బాగానే కత్తెరపెట్టాడు. రియాలిటీకి దగ్గరగా ఆర్ట్ డైరెక్టర్ పనితనాన్ని మెచ్చుకోవాలి. సయ్యిద్ తాజుద్దీన్ డైలాగ్స్ ఓకే. బడ్జెట్ పరంగా లోపంలేకుండా ఆపిల్ ట్రీ సంస్థ అందించిన నిర్మాణ విలువలు కనిపిస్తాయి.

కలిసొచ్చే అంశాలు
కథ
నటీనటులు
సెకండ్ హాఫ్
కామెడీ

కలిసి రానివి
పాటలు
ఫస్ట్ పార్ట్ సాగతీత
మిస్సైన లాజిక్స్

తీర్పు
టైం ఉంటే ఒకసారి చూసేయండి

what’s your rating on Zombie Reddy Movie

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 3.50 out of 5)

Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *