హైదరాబాద్ సినీమాక్స్ మల్టీప్లెక్స్ వేదికగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్, జియో స్టూడియోస్‌ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం 99 సాంగ్స్‌. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగానే హైదరాబాద్ వచ్చారు రెహమాన్. ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ విశ్వేశ్ కృష్ణమూర్తి. ఆయన కథకు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ప్రాణం పోసారని వెల్లడించారు. తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16వ తేదీన విడుద‌ల చేస్తున్నారు. ఇహన్ భ‌ట్ హీరోగా, ఎడిల్సి వ‌ర్గ‌స్ హీరోయిన్‌గా నటించారు. మ‌నీషా కొయిరాలా, లీసా రే వంటి సీనియర్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.