సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ ఫ్లిక్ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ డ్రామా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. ఇందులో లావ‌ణ్యా త్రిపాఠి హీరోయిన్‌. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ పోస్టర్ లో ఎయిట్ ప్యాక్ బాడీతో ఉన్న సందీప్ కిషన్ ఒక చేతిలో హాకీ స్టిక్ పట్టుకొని… మ‌రో చేతితో త‌న చొక్కాని స్టేడియంలో ఊపుతున్న‌ట్లు ప్రెజెంట్ చేసారు. విజయంతో వచ్చే ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని… ఓ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాకిది ప‌ర్‌ఫెక్ట్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
గేమ్ బిగిన్స్ ఇన్ థియేట‌ర్స్ సూన్‌ అనే క్యాప్ష‌న్‌తో రిలీజ్ చేసారి ఫస్ట్ లుక్ ని. దీనిని బట్టి త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్టు తెలుస్తోంది. సందీప్ కిష‌న్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో త‌న హాకీ స్కిల్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తాడట. టాలీవుడ్‌లో ఇది తొలి హాకీ ఫిల్మ్‌ అన్న ప్రచారం బాగానే చేస్తున్నారు. ఇక హిప్ హాప్ తమిళ్ కంపోజింగ్ సింగిల్ కింగులం పాట‌కి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఏ1 ఏక్స్‌ప్రెస్‌‌ ప్రజెంట్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనిలో ఉంది. సందీప్ కిష‌న్‌, లావ‌ణ్యా త్రిపాఠిలతో పాటూ మురళీ శ‌ర్మ‌, రావు రమేశ్, పోసాని, సత్యా ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, మ‌హేష్ విట్టా తదితరులు నటిస్తున్నారు.