బాలీవుడ్ స్టార్‌ ఆమిర్‌ఖాన్‌ ను కరోనా వైరస్‌ అటాక్ చేసింది. రీసెంట్ గా కొవిడ్‌-19 టెస్ట్ చేయించుకున్న ఆమీర్…తనకి పాజిటివ్‌ రిజల్ట్ వచ్చిందని ప్రకటించారు. ప్రెజెంట్ హోమ్‌ క్వారంటైన్‌లో ఆమీర్ రెస్ట్ తీసుకుంటూ వైద్యుల ఇన్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారని ఆయన‌ ఫ్రెండ్స్ తెలియజేసారు. అంతేకాదు తనలో ఇన్ని రోజులు ఉన్న సిబ్బందిని సైతం కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకునేలా చూస్తున్నారని తెలిసింది.
మరోసారి దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతుంది. రోజురోజుకి కొత్త కేసులు పుట్టుకొస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది. మరోవైపు బాలీవుడ్‌ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఈమధ్య కాలంలో రణ్‌బీర్‌ కపూర్‌, సంజయ్‌ లీలా భన్సాలి, అషిశ్‌ విద్యార్థి, కార్తిక్‌ ఆర్యన్‌, తారా సుతారియా, మనోజ్ భాజ్పేయ్ వంటివారని తాకింది కరోనా.

బీటౌన్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈమధ్యే మొబైల్ కి బైబై చెప్పేసిన ఆమిర్…సోషల్ మీడియా వేదికల నుంచి వైదొలగుతున్నట్టు అనౌన్స్ చేసారు. తన 56వ జన్మదిన వేడుకలను పూర్తిచేసుకున్న తర్వాతి రోజే సామాజిక మాధ్యమాలకు గుడ్‌బై చెప్పడం అభిమానులను కలచివేసింది. తన పట్ల ప్రేమాభిమానాలు చూపించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. ‘ఇదే నా చివరి పోస్ట్‌’ అన్న సందేశాన్ని పోస్ట్ చేసి సోషల్‌ మీడియా నుంచి నిష్క్రమించారు. తన చేయబోయే సినిమాలకు సంబంధించి..ఏవైనా అప్‌డేట్స్‌ ఉంటే… తన ప్రొడక్షన్‌ బ్యానర్ (akppl_official) అఫీషియల్ అకౌంట్ ద్వారా తెలియజేస్తానని చెప్పారు.

బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్ చేస్తోన్న ‘లాల్‌ సింగ్ చద్దా’ సినిమాలో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ పాత్ర కోసం నాగచైతన్య నెలరోజుల పాటు డేట్స్‌ కేటాయించాడు. నిజానికి ఈ రోల్ మొదట విజయ్ సేతుపతిని వరించింది. ఎస్ చెప్పిన సేతుపతి లాస్ట్ మినిట్ లో తప్పుకోవడంతో నాగ చైతన్య ఛాన్స్ అందుకున్నాడు. అమీర్ తో చేస్తున్న లాలా సింగ్ చద్దానే చైతూకి ఫస్ట్ బాలీవుడ్ మూవీ. మొత్తానికి ఇలా ఎంట్రీ గట్టిగానే ఉండేట్టు చూసుకున్నాడు నాగచైతన్య.