కార్తీ కాకుండా ధనుష్ ని యుగానికి ఒక్కడు పార్ట్ 2 లో హీరోగా ప్రకటించి సంచలనం సృష్టించారు డైరెక్టర్ సెల్వ రాఘవన్. అయితే దానికో మంచి కారణమే ఉందంటున్నారు ఇప్పుడు. 2010లో ‘ఆయిరతిల్ ఒరువన్..’ పేరుతో కోలీవుడ్ లో…యుగానికి ఒక్కడుగా టాలీవుడ్ లో హిట్ కొట్టారు డైరెక్టర్ సెల్వ రాఘవన్.
మళ్ళీ పదేళ్ల తర్వాత దీనికి పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారని తెలియడంతో అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. కొత్త ఏడాదిలో అడుగిడగానే సెల్వ రాఘవన్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సైతం సూపర్ వైరల్ అవుతోంది. అయితే.. ఈ సీక్వెల్ లో ఫస్ట్ పార్ట్ లో నటించిన కార్తీకి బదులు ధనుష్ ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యుగానికి ఒక్కడు కోసం అప్పట్లో కష్టపడిన కార్తీని కాదనుకోవడం మంచి పద్ధతి కాదనే వేడి వేడి చర్చలు జరిగాయి. అయితే అన్నింటికి ఓ ఇంట్రెస్టింగ్ సమాధానంతో ఫుల్ స్టాప్ పడింది.
కథ ప్రకారమే ధనుష్ ను సెలెక్ట్ చేసారట డైరెక్టర్. ‘యుగానికి ఒక్కడు’ మూవీ క్లైమాక్స్ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడే ఈ సీక్వెల్ మొదలవుతుందని చెబుతున్నారు. తొలి పార్ట్ లో హీరో కార్తీ చోళ యువరాజైన ఓ బాలుడిని పాండ్యుల నుంచి కాపాడి భుజాన వేసుకొని అడవుల్లోకి వెళ్తాడు కదా. ఆ పిల్లోడే ఇప్పుడు ధనుష్ రూపంలో పెరిగి పెద్దవాడు అవుతాడట. ఆ బాలుడి పాత్రలోనే హీరో ధనుష్ కనిపించనున్నాడట.


ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఉంది. మొదటి భాగంలో హీరో కార్తీదే లీడ్ రోల్. మరి అలాంటి పాత్రను ఇందులో ఎలా ముగిస్తున్నారనేది కీలకంగా మారింది. ఎలాంటి ట్విస్టుతో ఈ పాత్రను ఎండ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కానీ అది తెలుసుకోవాలంటే 2024 వరకు ఆగాల్సిందే. అప్పుడే ఈ ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధమవుతుందట.
‘ఆయిరతిల్ ఒరువన్-2’ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. అరవింద్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ను కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.