బ్లాక్ బస్టర్ క్రాక్ తర్వాత ఖిలాడి కోసం కష్టపడుతున్నారు రవితేజ. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడిలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు మాస్ రాజా. అయితే ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగానే మరో సినిమాకు తాజాగా కమిటయ్యారు. త్రినథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 68వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఖిలాడీ పూర్తి చేసిన వెంటనే వచ్చే నెల నుంచి సెట్స్ పైకెళ్లనున్న ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ లో రవితేజ పాల్గొననున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. కో ప్రొడ్యూసర్ గా వివేక్‌ కూచిభొట్ల వ్యవహరించనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణల వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.