సోనూసూద్ … ఇప్పుడు పరిచయం అక్కర్లేని మంచికి మారు పేరు. కరోనా కాలంలో ఎన్నోరకాలుగా ఎందరినో ఆదుకొని…ఇప్పటికీ అవసరం ఉందన్న వారికి తనవంతు సహాయం అందిస్తున్న సోనూని ప్రపంచం గుర్తించింది. ఆయన చిరూ – చరణ్ కాంబో ఆచార్యలో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్ మీద వెళ్లి అందరినీ ఆకట్టుకున్నారు. సైక్లింగ్ అంటే సోనూ సూద్ కి చాలా ఇష్టం. పైగా.. ఉద‌యాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవ‌స‌రం రావడంతో… సైకిల్ ఎక్కి పదర పదర పద అన్నారు. అటు వ్యాయామం, ఇటు.. ప్ర‌యాణం రెండూ క‌లిసొచ్చేసాయి సోనూకి. ఇప్పుడీ ఫోటోలు వైరల్ గా మారాయి.

లాహే లాహే అంటూ స్టెప్పులేసారు మెగాస్టార్. చాలారోజుల తర్వాత చిరూ మాస్ డాన్స్ చూసిన ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. అయితే ఈ పాటలో సంగీత, కాజల్ ఎక్కువగా కనిపించారు. చిరూ కంటే ఎక్కువగా వారి డాన్స్ హైలెట్ గా మారింది. మెగాస్టార్ పూర్తి డాన్స్ ను థియేటర్లోనే ఎంజాయ్ చేసేందుకు…పూర్తిగా రివీల్ చేయలేదు మేకర్స్. చూస్తుంటే…చిరంజీవి, మణిశర్మ..ఈ సూపర్ హిట్ కాంబినేషన్…మళ్లీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఆచార్య షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి కొడుకు రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి రాబోతున్నారు.

Source: Aditya Music

లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది ట్రిపుల్ ఆర్ . యాక్షన్ షూట్ తోపాటు ప్యాచప్స్ కంప్లీట్ చేస్తున్న RRR సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో కంటిన్యూ అవుతోంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ,బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబయ్ సెట్స్ లో జరుగుతోంది. విజయ దేవరకొండ సైతం ఇప్పట్లో ముంబై వదిలి వచ్చేలా లేడు. లైగర్ షూటింగ్ ఇంకా ముంబైలోనే చేస్తున్నారు పూరీ జగన్నాథ్.

చెర్రీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ట్రీట్ ఇచ్చిన చిరంజీవి ఆచార్య టీమ్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉంది. ఏప్రిల్ 2 నుంచి ఆచార్య సినిమా కోకాపెట్ లో మళ్లీ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ బెల్గాం ఆశ్రమంలో జరుగుతుంటే, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున నటిస్తోన్న సినిమా గోవాలో జరుగుతుంది. ఇక రామానాయుడు స్టూడియోలో శరవేగంగా దృశ్యం -2 షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు వెంకటేశ్.

మహేశ్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ గోవాలో జరుగుతుండగా… ఇటలీలో ఖిలాడీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు రవితేజ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో పుష్ప సీన్స్ ను టోలీచౌకిలో చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ గని సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో కొనసాగుతుంది. సాయిధరమ్ తేజ్, దేవా కట్టా సినిమా రిపబ్లిక్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోకల్ లొకేషన్స్ లోనే జరుగుతుంది.

మెగాపవర్ స్టార్ బర్త్ డే స్పెషల్ గా అటు త్రిపుల్ ఆర్…ఇటు ఆచార్య నుంచి ఫస్ట్ లుక్స్ వచ్చేసాయి. మెగాభిమానుల్ని రెండూ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రెండింటితో పాటూ చిరూ షేర్ చేసిన ఓ ఎమోషనల్ వీడియో ప్రెజెంట్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

ట్విటర్‌ వేదికగా విషెస్ వీడియో పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు చిరంజీవి. ‘హ్యాపీ బర్త్‌డే మై బాయ్’‌ అంటూ చిరూ షేర్ చేసిన వీడియో… మెగా అభిమానులను ఎమోషనల్ గా థ్రిల్ చేసింది. ఇక ఆచార్య నుంచి సిద్ధ ఫస్ట్ లుక్ పోస్ట్ చేస్తూ… “నీతో నటించాలన్న కోరిక నెరవేరింది నాన్న… ఇంతకు మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది” అంటూ ట్వీట్ చేసారు రామ్ చరణ్.

చిన్నప్పుడు చరణ్‌ చిరూకు గొడుగు పట్టిన పిక్ తో పాటు.. పెద్దాయ్యాక తండ్రికి గొడుగు పడుతున్న మరో రెండు ఆచార్య సెట్ లోని ఫొటోలను ఇందులో చూపించారు. ‘అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడు కేరింగ్‌ సన్‌’ అంటూ ఈ వీడియోని ఎండ్ చేసారు చిరంజీవి..

స్టార్ వారసుడైనా ఇండస్ట్రీలో తాను స్టార్ గా మారేందుకు కష్టపడ్డాడు. నటుడిగా ఎంట్రీ ఇవ్వడానికి వారసత్వం పనికొస్తుందేమో కానీ.. నటవారసుడిగా నిలబడడానికి కాదని నిరూపిస్తూ.. సొంతగా ఎదుగుతూ సత్తా చూపిస్తున్నాడు మెగా పవర్ స్టార్. యాక్టింగ్ లోనే కాదు ..ప్రొఫెషనల్ చాలా షేడ్స్ చూపిస్తున్నారు రామ్ చరణ్. అందుకే ఇప్పుడు ఆయనకి తెలుగునేల మీదే కాదు…ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ గ్రూప్స్ వెలిసాయి. బర్త్ డే ప్రత్యేకంగా న్యూయార్ టైమ్ స్వేర్స్ లోని నాస్దక్ బిల్డింగ్ పై చెర్రీ ఫోటోలను ప్రదర్శించారు.

మెగా ఫ్యామిలీ వారసుడంటే ఆషామాషీ కాదు.. అలా ,ఇలా ఉండకూడదు.. ఓ రేంజ్ లో ఉండాలి. అందుకే.. మెగాస్టార్ యాక్టింగ్ తో పాటు పవర్ స్టార్ పవర్ ను కలుపుకున్న ఈ మెగా పవర్ స్టార్ యంగ్ ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోగానే కాదు .. తండ్రితో కలిసి యాక్టింగ్ లో, డాన్స్ లో పోటీ పడుతున్నారు, ప్రొడ్యూసర్ గా కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నారు చరణ్. అంతేకాదు .. సింప్లిసిటీ మెయింటెన్ చేస్తూ.. తన ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు చరణ్. ఈ శనివారం రామ్ చరణ్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. నిన్న ఫ్యాన్స్ మీట్ లో భాగంగా చరణ్ కు విషెస్ తెలియజేసేందుకు ప్రవాహంలా అభిమానులు తరలివచ్చారు.

రామ్ చరణ్ కెరీర్ రంగస్తలం ముందు వరకూ ఒక లెక్క..రంగస్తలం తర్వాత ఒక లెక్క అన్నట్టు సినిమాల సెలక్షన్ లో వేరియేషన్ చూపిస్తున్నారు చరణ్. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. ఇంతకుముందెన్నడూ లేనంత ఫియర్ లెస్ యాక్షన్ ఎమోషన్స్ ని చూపించబోతున్నారు.

మెగా స్టార్ వారసుడిగా డ్యాన్సులు, ఫైట్లతో చిరంజీవిని మరిపిస్తున్నాడు. తండ్రి స్టార్ డమ్ ను అందుకోవడానికి ట్రై చేస్తూ..తండ్రిని మరిపించేలా స్టెప్స్ వేస్తూ మెగా పవర్ స్టార్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఆచార్య సినిమాలో తండ్రీ కొడుకులిద్దరూ కలిసి హంగామా చెయ్యబోతున్నారు. వీళ్లిద్దరినీ ఈ సినిమాలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు అభిమానులు .

హీరోగానే కాదు, తండ్రితో పోటీపడుతూ నటిస్తున్న కో యాక్టర్ గానే కాకుండా ..ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అవుతున్నారు చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి చిరంజీవితోనే ఖైదీ నెం. 150 తో పాటు భారీ బడ్జెట్ సినిమా సైరా నర్సింహారెడ్డి చేసి సూపర్ హిట్ కొట్టారు చరణ్. ఇప్పుడు ఆచార్య సినిమాకి కూడా కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు రామ్ చరణ్. ఇక మరోవైపు నేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా అనౌన్స్ చేసి…ప్రేక్షకులకి కిక్ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు…మీతో పనిచేసేందుకు వెయిట్ చేస్తున్నామంటూ ట్వీట్ చేసారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో మరింత జోష్ నింపేలా మేకర్స్ వరుసగా సర్పైజెస్ ఇస్తున్నారు. అడ్వాన్స్ విషెస్ తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ నుంచి సీతారామరాజుగా చెర్రీని పరిచయం చేసారు రాజమౌళి. ఇక తాజాగా తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తోన్న ఆచార్య నుంచి సిద్ధగా ఎంట్రీ ఇచ్చాడు చరణ్. “నీతో నటించాలన్న కోరిక నెరవేరింది నాన్న… ఇంతకు మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది” అంటూ ట్వీట్ చేసారు రామ్ చరణ్. చిరూతో కలిసి తుపాకులతో నడుస్తోన్న ఈ ఫస్ట్ లుక్ మెగాఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. కాగా చిరూ తాజాగా లీక్ చేసినట్టు మావోయిస్తు పాత్రల్లోనే దర్శనమిచ్చారు తండ్రికొడుకులు.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ కూడా ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈమధ్యే అటు మారేడుమిల్లి అడవుల్లో…ఇటు ఇల్లందు బొగ్గుగనుల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఇక మెగాస్టార్ సరసన కాజల్ కిచ్లూ నటిస్తుంటే…మెగాపవర్ స్టార్ జోడీగా పూజా హెగ్దే మెరవనుంది. మే 13న థియేటర్స్ కు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

బిగ్ బాస్ ఫినాలేలో మాటిచ్చినట్టుగానే ఒక్కొక్కరికి ఒక్కో అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా మెహ‌బూబ్‌కు ఆచార్య‌లో కీ రోల్ పోషించే ఛాన్స్ ఇచ్చారట చిరూ. ఇందులో జానపద నృత్యకారుడిగా..మెహబూబ్ పాత్ర ఎమోషనల్ గా ఉంటుందని టాక్. ఇంట్రవెల్ కి ముందు చనిపోయే పాత్రతో ఓ రేంజ్ ట్విస్ట్ ఇస్తాడట మెహబూబ్.

మామ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంటే…అల్లుడు స్నేహ ధర్మాన్ని పాటిస్తున్నాడు. మంచు మనోజ్ అహం బ్ర‌హ్మాస్మి సినిమాలో గెస్ట్ రోల్‌ చేసేందుకు సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పాడ‌ట‌. పాత్ర వ్య‌వ‌థి త‌క్కువే అయినా సినిమాను మ‌లుపు తిప్పే పాత్ర అని స‌మాచారం. మనోజ్, సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అందుకే ఫ్రెండ్ కోసం కాదనకుండా అహం బ్రహ్మాస్మీ అంటున్నాడు తేజ్. కాగా మంచు మనోజ్ కిది కమ్ బ్యాక్ మూవీ. అహం బ్రహ్మాస్మీ రిజల్ట్ పై మనోజ్ సినీ కెరీర్ ఆధారపడిఉంది.

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ మూవీగా ఈ ప్రాజెక్ట్ ను కొరియోగ్రాఫర్ ప్లస్ డైరెక్టర్ ప్రభుదేవా తెర‌కెక్కిస్తున్నాడు. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ హిట్స్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. నిజానికి గతేడాదే రాధే షూటింగ్ పూర్తైంది. కానీ క‌రోనా కారణంగా రిలీజ్ వాయిదా ప‌డింది. తాజాగా మూవీ మేక‌ర్స్ రాధే మూవీ విడుదల తేదీని ప్ర‌క‌టించారు. ఈద్ పండుగ సందర్భంగా మే 13న రాధేను ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్రకటించారు,
అయితే మే 13న చిరంజీవి, చరణ్ నటిస్తోన్న ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ‘రాధే’ కూడా అదే రోజున రాబోతుంది. ఆచార్య ఎలాగూ తెలుగు ప్రేక్షకుల మీదే దృష్టిసారించింది. చిరూకి ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. ఎటొచ్చి ఇక్కడ సల్మాన్ కి చుక్కెదురయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. దిశాప‌టానీ హీరోయిన్ గా నటిస్తున్న రాధేలో ర‌ణ్ దీప్ హుడా, మేఘా ఆకాష్, జాకీ ష్రాఫ్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు జేకే 5 ఓపెన్‌కాస్ట్ లో ‘ఆచార్య’ సినిమా క్లెమాక్స్‌ షూట్ జరుగుతుంది. మార్చి 11 వరకు జరిగే ఈ చిత్రీకరణలో తండ్రీకొడుకులు చిరంజీవి, చరణ్ పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి చిరూ, చరణ్ ఫోటోలు బయటికొచ్చాయి. రామ్ లక్ష్మణ్ ఫైట్ సీన్స్ ను కంపోజ్ చేస్తుండగా..కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. మార్చి 11 వరకు ఇల్లెందులో ఆచార్య కోసం కష్టపడుతున్న చెర్రీ…మార్చి 13నుంచి త్రిపుల్ ఆర్ కోసం రొమాన్స్ చేయబోతున్నాడు.

Megastar chiranjeevi, ram charan, korata siva, acharya shooting in yllandu, Aha Chitram

ఇక త్రిపుల్ ఆర్ క్లైమాక్స్ సన్నివేశాల్లో భారీ ట్విస్టు ఉండబోతుందని సమాచారం. కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజుల్లో ఒకరికి కళ్లు పోతే, మరొకరికి కాళ్లు పోతాయన్న ప్రచారం జరుగుతోంది. కాళ్లు లేవి వ్యక్తిని…కళ్ల పోయిన వ్యక్తి భుజాన ఎక్కించుకుని భీభత్స యుద్ధాన్ని నడిపిస్తారని తెలుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లలో ఎవరూ ఏ అవయవాన్ని పొగొట్టుకుంటారన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. మరోవైపు ఆర్ఆర్ఆర్ తాజా షెడ్యూల్ కోసం మరోసారి హైద‌రాబాద్ రాబోతుంది ఆలియా భట్. మార్చి 13న స్పెష‌ల్ సెట్‌లో రామ్ చ‌ర‌ణ్‌, అలియా జంటపై సాంగ్‌ చిత్రీక‌రించ‌నున్నారట జ‌క్క‌న్న‌.

కొన్నిరోజుల నుంచి చిరంజీవి, చరణ్ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లిలో ఆచార్య షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే చెర్రీ వైఫ్ ఉపాసన సైతం షూటింగ్ లోకేషన్ కు చేరుకొని సరదాగా గడిపారు. కాగా 20 రోజుల బిజీ షెడ్యుల్ తర్వాత మూవీ యూనిట్ కి సెండాఫ్ ఇచ్చారు రామ్ చరణ్. చిరూ కాంబినేషన్ సీన్స్ పాటూ…గిరిజన యువతిగా పూజాహెగ్దేతో సైతం కొన్ని సీన్స్ చేసారు. అయితే హైదరాబాద్ వచ్చేందుకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చెర్రీకి గ్రాండ్ గా బైబై చెప్పారు మెగా ఫ్యాన్స్.