‘నువ్వేకావాలి’చిత్రంతో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చి.. నువ్వే నువ్వే, నువ్వులేక నేనులేను వంటి కమర్షియల్ హిట్ ప్రేమకథాచిత్రాలతో తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో తరుణ్. అయితే ఆ తర్వాత ఏ సినిమా చేసినా తరుణ్ కి కలిసిరాలేదు. సేమ్ టైమ్ వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొన్న తరుణ్ సినిమాలను దాదాపు వదిలేసాడనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా తన జిగిరీ దోస్త్ చెప్పిన ఓ న్యూ ఏజ్ లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. ఈ మూవీలో తరుణ్ ఢిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. అతిత్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ క్రూ అండ్ కాస్ట్ వివరాలు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. ఈ చిత్రం ద్వారా హీరో తరుణ్ తన మిత్రుడిని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తుండడం విశేషంగా చెప్పుకుంటున్నారు.