నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో హిట్ 2 రానున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో హీరో మారాడు. అడవి శేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసారు నాని. విశ్వక్ సేన్ చూపించిన హిట్ ఫస్ట్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అందుకే ప్రొడ్యూసర్ నాని మళ్లీ నిర్మాతగా అదే ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్ తో ఈ సీక్వెల్ రూపొందిస్తున్నాడు. కానీ ఈసారి హీరో మారాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో… హీరో అడవి శేష్ సైడ్ లుక్ లో పక్కనే జర్మన్ షెపర్డ్ కుక్కతో సీరియస్ గా కనిపిస్తున్నాడు. ‘కృష్ణదేవ్ అకా కేడి ఆఫీసర్ ఆన్ బోర్డుకు స్వాగతం’ అంటూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొదటి భాగాన్ని తీసిన డైరెక్టర్ శైలేష్ కొలనునే ఈ పార్ట్ ను తెరకెక్కించనున్నారు. కాగా మేజర్ షూటింగ్ అయినవెంటనే హిట్ సెకండ్ ఇన్వెస్టిగేషన్ చేపడతానని నానికి రిప్లై ఇచ్చాడు అడవి శేష్.