ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఉప్పెన ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతులమీదుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి తారకే వాయిస్ ఓవర్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి లేదు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఉప్పెన ఆత్మను ఆడియెన్స్ కు పరిచయం చేసారీ ట్రైలర్ తో. జూనియర్ కి సైతం ఉప్పెన ట్రైలర్ విపరీతంగా నచ్చిందనీ…సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా అద్దరగొట్టారు. జంట చూడటానికి చాలా బాగుంది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలతో ఈ ఇద్దరూ అందరి హృదయాలను గెలుచుకున్నారు. అలాగే దేవిశ్రీప్రసాద్ సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విజయ్ సేతుపతి నటవిశ్వరూపాన్ని చూపించారు. హీరోయిన్ తండ్రిగా ఆయన డైలాగ్ డెలివరీ, నటన అద్భుతం అంటున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ తో ట్రెండింగ్ లో ఉన్న ఉప్పెన ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Mythri Movie Makers