వాళ్లు, వీళ్లు కాదు…ఏకంగా మహేశ్ బాబుతోనే జాన్వీకపూర్ ఎంట్రీ ఉండబోతుందనే ప్రచారం జోరందుకుంది. నిజానికి మహేశ్ ఫాదర్ సూపర్‌ స్టార్‌ కృష్ణ, గ్లామర్ క్వీన్ గా సినీరంగాన్ని ఏలిన శ్రీదేవి కాంబోలో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి మనకి తెలిసిందే. అప్పట్లో వీరి జంటకి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఎన్టీఆర్ సినిమా అనీ, రామ్ చరణ్ సినిమా అనీ అనుకుంటే కృష్ణ వారబ్బాయి సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తొలిసారి టాలీవుడ్ సినిమా కోసం వర్క్ చేయబోతుందని టాక్. ఈ సినిమాకు కరణ్‌ జోహార్‌ ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. అంతేకాదు ఓ న్యూ టాలెంట్ ని ఈ ప్రాజెక్ట్ తో డైరెక్టర్ గా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట. చిత్రీకరణను కూడా ఎక్కువగా సాగదీయకుండా రెండు నెలల్లోనే పూర్తి చేస్తారని చెప్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే!

ప్రస్తుతం ‘గీతా గోవిందం’ ఫేం పరశురామ్‌ డైరెక్షన్లో మహేశ్ చేస్తున్న ‘సర్కారు వారి పాట‘ పూర్తవగానే మహేశ్‌ జాన్వీతో సినిమా పట్టాలెక్కింటనున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాతే దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

జార్జ్ రెడ్డి, ప్రెజర్ కుక్కర్ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నిర్మాత అప్పిరెడ్డి. ఆయన తన మూడో సినిమాని బిగ్ బాస్ ఫేం సోహైల్ హీరోగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి ఈ ప్రాజెక్ట్ తో పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో షురూఅయింది. ఇప్పటిదాకా ఇండియన్ మూవీ హిస్టరీలోనే లేని, రాని సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారనట మేకర్స్. అంతేకాదు సొహైల్ హీరోగా భారీ బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా శ్రావణ్ భరధ్వాజ్ సంగీతం అందిస్తుండగా… నిజార్ షఫీ సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నాడు. మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తారట.

Biggboss sohel, sohel movie started

కళాతపస్వి కే విశ్వనాధ్ గారి జన్మదినం సందర్భంగా మన రేడియో బృందం ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మీరు మంచి ఆరోగ్యం మరియు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము కే విశ్వనాధ్ గారి జన్మదినం సందర్భంగా మన రేడియో బృందం ప్రత్యేక వీడియో

శాండిల్ వుడ్ స్టార్‌ యాక్టర్ సుదీప్‌ కి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశంలో ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ మాత్రమే సంపాందిచిన అటువంటి గుర్తింపు….ఇప్పుడు సుదీప్ సొంతమైంది. భారతీయ వెండితెరపై విలక్షణ నటుడన్న పేరుంది ఈ హీరోకి. రీసెంట్ గా ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా బిల్డింగ్ పై సుదీప్ లేజర్ షో వేసారు. ఆయన హీరోగా నటిస్తోన్న ‘విక్రాంత్‌ రోనా’ మూవీ టైటిల్‌ లోగోను, టీజర్‌ను ఈ లేజర్‌ షోతో బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ప్రపంచం మొత్తానికి ఓ కొత్త హీరో దొరికాడంటూ ప్రశంసలు కురిపించారు.

ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులు, ప్రభావిత వ్యక్తులతో పాటూ అతిముఖ్య సంఘటనలు మాత్రమే దుబాయ్ బూర్జ్ ఖలీఫా లేజర షో ద్వారా కనిపించే అదృష్టాన్ని దక్కించుకున్నాయి. ఇక ఇండియాపరంగా చూసుకుంటే షారుఖ్‌ ఖాన్ తర్వాత సుదీప్‌కే ఇంతటి ఘనత సొంతమైంది. దీంతో సుదీప్‌ ఫ్యాన్స్ ఫుల్‌ జోష్ మీదున్నారు. తాము అభిమానించే ఓ నటుడికి ఇలాంటి గౌరవం దక్కడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.

విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న నారప్ప ఓ కొలిక్కి వచ్చేసింది. మే 14న రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసింది. అటు వరుణ్ తేజ్ తో కలిసి యమాజోరుగా ఎఫ్ 3ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3…ఆగస్టు 27న ప్రేక్షకులకు నవ్వులవిందును అందించేందుకు కర్చీప్ వేసింది. మరి నెక్ట్స్…వెంకీ గుర్రపు స్వారీ చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్.
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వెంకటేశ్ నటిస్తారని తెలుస్తోంది. గుర్రపు పందాల నేపథ్యంలో సాగే ఈ ప్రాజెక్ట్ లో వెంకటేశ్ హార్స్ రైడర్ గా కనిపిస్తారట. ఇప్పటికే తరుణ్ భాస్కర్..హీరో వెంకటేశ్ కి కథ చెప్పేయడం…నచ్చడం…ప్రొడ్యూసర్ గా సురేశ్ బాబు ముందుకు రావడం అన్నీ జరిగిపోయాయని అంటున్నారు. జూన్ లేదంటే జూలై నుంచి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ గుర్రపుస్వారీ చేస్తారని సమాచారం. మరి చాలాసార్లు ఇలా వార్తల్లో నిలిచి మాయమయిన ఈ న్యూస్…ఈసారైన నిజమవుతుందా…చూడాలి.