చేయని తప్పుకి జైలు జీవితం అనుభవిస్తున్న ఓ యువకుడు ఎలా బయటకు వచ్చాడన్న కథాంశంతో రూపొందిన చిత్రం ‘నాంది’. అల్లరి నరేశ్ హీరోగా…వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసారు. ఈమధ్యే థియేటర్లలో రిలీజై సక్సెస్ టాక్ సంపాదించింది. ఇక అతిత్వరలోనే…అంటే మార్చి 12వ తేదీనే ఆహా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. సతీశ్‌ వేగేశ్న నిర్మించిన నాందితో అల్లరి నరేష్ తన సినీజీవితానికి సరికొత్త నాంది పలికారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతో వరలక్ష్మికి సైతం తెలుగులో అవకాశాలు పెరుగుతున్నాయి. స్నేహితుడిగా నటించిన ప్రియదర్శి సైతం మంచి పేరుతెచ్చుకున్నాడు.