ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నాని టక్ జగదీష్ అలర్టయింది. సందర్భాన్ని వాడుకునేందుకు ప్రేమగా ఫిక్సయింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ఫ్యామిలీ కం యాక్షన్ చిత్రం ”టక్ జగదీష్”. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి – హరీష్ పెద్ది జతగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాని సరసన రీతూ వర్మతో పాటూ ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఏప్రిల్ 23న టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్… ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడిక వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ సాంగ్ ‘ఇంకోసారి ఇంకోసారి’ ని విడుదల చేయనున్నారు.

సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ గీతాన్ని ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. కాగా దీనికి సంబంధించి ఓ లవ్లీ పోస్టర్ ని మూవీ యూనిట్ వదిలింది. హీరోయిన్ రీతూ వర్మ ఒక దగ్గర కూర్చోగా.. మన నాని ఆమె చేయి పట్టుకుని కళ్ళలోకి చూస్తున్నాడు. ఈ సినిమాకి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తుండగా… ప్రవీణ్ పూడి ఎడిటర్. నాజర్, రోహిణి, డేనియల్ బాలాజీ, ప్రవీణ్, ప్రియదర్శి, నరేష్ వంటి వారు నటిస్తున్నారు. ఇది నాని నటిస్తోన్న 26వ చిత్రం. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత… నాని – శివ నిర్వాణ కాంబో మూవీగా వస్తోన్న ‘టక్ జగదీష్’ పై ప్రేక్షకులకి మంచి అంచనాలే ఉన్నాయి.

o

మెగాస్టార్ ఆచార్యకు సంబంధించి క్రేజీ అప్డేట్ రిలీజ్ చేసారు. మూవీ టీజర్ రిలీజ్ డేట్ ని మెక్షన్ చేస్తూ వీడియోను పోస్ట్ చేసారు. దానికన్నా ముందు నిన్న చిరూ అడిగిన టీజర్ ఎప్పుడూ అన్న ప్రశ్నకు…’డియర్ చిరూ సర్, ధర్మస్థలి తలుపులు జనవరి 29 సాయంత్రం 4 గంటల 5నిమిషాలకు తెరుచుకుంటాయి’ అంటూ కొరటాల శివ బదులిచ్చారు. ఆ తర్వాత ఈ న్యూస్ కి సంబంధించి వీడియోను రిలీజ్ చేసారు. సో జనవరి 29 సాయంత్రం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆచారయ టీజర్ వచ్చేస్తుందన్నమాట.
కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇక చెర్రీకి జోడిగా పూజా హెగ్దే దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని తెలుస్తోంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా…కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ లు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆచార్య నుంచి రిలీజైన చిరూ ఫస్ట్ లుక్, టెంపుల్ సెట్ వీడియో, రామ్ చరణ్ బ్యాక్ లుక్ జనాల్ని బాగా ఆకర్షించాయి. మరి 29న రానున్న టీజర్ ఎంతలా అలరిస్తుందో చూడాలి.

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ఓ ట్రాక్ లో పడుతోంది టాలీవుడ్. డబ్బింగ్ మాస్టర్ కాకుండా ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు థియేటర్స్ లో సందడి చేసాయి. క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా…రెడ్ బ్రేక్ ఈవెన్ లోకి వెళ్లింది. ఇంక అదుర్స్ అనిపించుకోవాల్సింది అల్లుడు మాత్రమే. సరే…లాభనష్టాలు ఎలా ఉన్నా…సినిమా హాళ్లకు వచ్చేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం అర్ధమయింది. దీంతో వరుసగా థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.

ఈ క్రమంలో… మహాశివరాత్రిని టార్గెట్ చేస్తూ ఇప్పటికే కొన్ని సినిమాలు బరిలోకి దిగాయి. మార్చి 12 మహా శివరాత్రి సందర్భంగా బాక్సాఫీస్ ను హీట్ ఎక్కించేందుకు వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా మూడు సినిమాల గురించి చెప్పుకోవాలి. ఈ మూడూ కూడా శివరాత్రికి ఒకరోజు ముందు మార్చి 11న రిలీజ్ డేట్ ప్రకటించాయి. శర్వానంద్ శ్రీకారంతో…గాలి సంపత్ గా శ్రీ విష్ణు… జాతిరత్నాలు అంటూ నవీన్ పొలిశెట్టి క్యూలో నిలిచారు. కథే ప్రాధాన్యంగా సాగే ఈ మూడు సినిమాలపై గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నారు ఈ హీరోలు. అందుకే బరిలో ఎంతమందున్నా ఢీ కొట్టేందుకు సై అంటున్నారు.

నిజానికి గాలి సంపత్ మినహా.. శ్రీకారం, జాతిరత్నాలు ఎప్పుడో పూర్తయ్యాయి. 2020 వేసవిలోనే వచ్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూ చివరికి శివరాత్రికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో గాలి సంపత్ తెరకెక్కగా, డైరెక్టర నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి జాతిరత్నాలు చిత్రాన్ని నిర్మించారు. అలాగే గ్రామీణ నేపథ్యంలో తీసిన శర్వానంద్ శ్రీకారం చిత్రం ఇప్పటికే సంక్రాంతి పాటతో బజ్ క్రియేట్ చేసింది. మరి చూద్దాం…ఎవరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో….

ఒక్క మరణం…కరోనా వేళ బిక్కుబిక్కమని కాలం గడుపుతున్న జనాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎన్నో ప్రశ్నలను పుట్టించింది. ఎందరినో ముద్దాయిలుగా నిలబెట్టింది. అనేక అనుమానాలు, అంతుపట్టని రహస్యాలు…ఎక్కడో మొదలై ఎక్కడికో చేరింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అవును సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం… 2020లో ఓ తీరని విషాదం. నేడు సుశాంత్ సింగ్ జన్మదినం. అందుకే యావత్ భారతదేశ ప్రేక్షకలోకం…ఆ నటుడిని గుర్తుచేసుకుంటుంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్…మరణించిన తర్వాత దేశమంతా మార్మొగిన పేరిది. జూన్ 14న తన ఫ్లాట్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బీహార్ లోని పాట్నాలో జనవరి 21న జన్మించిన సుశాంత్ వయసు కేవలం 34ఏళ్లు. ఎం.ఎస్.ధోనీ, కేధారనాథ్, చిచోరే వంటి సినిమాలు చూస్తే సుశాంత్ ప్రతిభ ఎలాంటిదో అర్థమవుతుంది. కేవలం నటుడిగానే కాదు…చదువు, డాన్స్, సామాజిక సేవల్లో సైతం ముందుండేవాడు సుశాంత్. అయితే సుశాంత్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో భాగంగా బయటికొచ్చిన డ్రగ్స్ బాగోతం బాలీవుడ్ నే కాదు…దక్షిణాది పరిశ్రమను షేక్ చేసింది. ఆయన మరణం తర్వాత ఓటీటీలో రిలీజైన దిల్ బెచరా గతేడాది అరుదైన రికార్డులను సాధించింది. అత్యధికులు వీక్షించిన సినిమాగా, గూగుల్ లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాగా, ట్విట్టర్ ట్రెండింగ్ మూవీగా క్రెడిట్స్ దక్కించుకుంది.